Macherla Niyojakavargam Pre Business: నితిన్ సినిమాకు భారీ డిమాండ్.. లాభాల్లోకి రావాలంటే?

నితిన్ నటించిన మాస్ హై వోల్టేజ్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా విడుదలకు సిద్ధమయింది. ఈ శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలోని విడుదలవుతొంది. ఇప్పుడిప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలకు జనాలు రావడం మొదలుపెట్టారు. ఇక నితిన్ సినిమాకు కూడా విడుదలకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది కాబట్టి ఇపెనింగ్స్ హై రేంజ్ లోనే దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ గా ఎంత బిజినెస్ చేసింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టాలి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

నితిన్ బిగ్గెస్ట్ రిలీజ్

నితిన్ బిగ్గెస్ట్ రిలీజ్

యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న నితిన్ చాలాకాలం తర్వాత కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎడిటర్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఒక విధంగా నితిన్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లో విడుదలవుతున్నట్లు టాక్. ఈ సినిమాను మొదటిరోజు మొదటి షో చూడాలి అని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక్క పాటతోనే..

ఒక్క పాటతోనే..

మాచర్ల నియోజకవర్గం సినిమాకు హైప్ పెరగడానికి ఎంతో సమయం పట్టలేదు కేవలం ఒకే ఒక పాటతోనే సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది. స్వర సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ లో అంచనాలు స్థాయిని పెంచేసింది. రారా రెడ్డి అనే పాటలో అంజలి గ్లామర్ షో అలాగే నితిన్ మాస్ స్టెప్పులు కూడా యువతను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది.

మంచి హైప్ తో సాలీడ్ బిజినెస్

మంచి హైప్ తో సాలీడ్ బిజినెస్

ఈ సినిమాకు పెరిగిన హైప్ తో మార్కెట్లో మంచి వాల్యూ అయితే ఏర్పడింది. నితిన్ గత సినిమాలో నిరాశపరిచినప్పటికీ కూడా మాచర్ల నియోజకవర్గం సినిమాకు పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ సినిమాలో ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలోనే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

ఇక ఏరియాలో వారిగా సినిమా చేసిన బిజినెస్ వివరాలలోకి వెళితే.. నైజాంలో 6 కోట్ల ధర పలికిన ఈ సినిమా సిడెట్లో ఐదు కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 10 కోట్ల బిజినెస్ చేసిన మాచర్ల నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మొత్తంగా 19 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.

టార్గెట్ ఎంతంటే?

టార్గెట్ ఎంతంటే?

ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో చూసుకుంటే నితిన్ సినిమా కోటి వరకు బిజినెస్ చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో 1.20 కోట్ల టార్గెట్తో అక్కడ మార్కెట్లో విడుదలవుతోంది. ఇక తెలంగాణ ఆంధ్రలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కలుపుకొని మాచర్ల నియోజకవర్గం సినిమా 21.20 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే సినిమా సక్సెస్ కావాలి అంటే 22 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. మరి నితిన్ ఎన్ని రోజుల్లో ఈ టార్గెట్ ను ఫినిష్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X