MAD 1st Week Collections: 2 కోట్ల చిన్న సినిమా.. వారంలోనే సంచలనం.. ఏంటి అన్ని కోట్ల లాభమా!
తెలుగు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నా.. కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చే యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీలకు మాత్రం మంచి స్పందన లభిస్తూనే ఉంది. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇలా గత వారంలో విడుదలైన సినిమానే 'మ్యాడ్'. ముగ్గురు కొత్త కుర్రాళ్లు నటించిన ఈ చిత్రం ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది. దీనికి మొదటి నుంచీ వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం లాభాలనూ రాబడుతోంది. మరి 'మ్యాడ్' మూవీ వారంలో ఎంత రాబట్టిందో చూడండి!
ఫుల్ ఫన్‌తోనే వచ్చిన మ్యాడ్:సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రేజీ సినిమానే 'మ్యాడ్'. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. దీనికి భీమ్స్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:యువతకు కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. దీంతో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఏడో రోజు ఎంత వచ్చింది?:ముగ్గురు కుర్ర హీరోలు కాంబినేషన్‌లో క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, ఏడో రోజు కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఏడో రోజు రూ. 40 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 75 లక్షలు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టి సత్తా చాటుకుంది.

7 రోజుల్లో తెలుగు వసూళ్లు:ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో ఊహించని రీతిలోనే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 5.12 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 11.10 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో కొన్ని రికార్డులను కూడా నమోదు చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:కాలేజ్ నేపథ్యంతో రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ తక్కువ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం రెండు రోజుల్లో 360K డాలర్లు అంటే రూ. 2.99 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. వీటితో కలిసి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'మ్యాడ్' రూ. 6.91 కోట్లు షేర్‌తో పాటు రూ. 14.00 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:విడుదలకు ముందే హైప్‌ను క్రియేట్ చేసుకున్న 'మ్యాడ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 7 రోజుల్లోనే ఈ సినిమా రూ. 6.91 కోట్లు రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.41 కోట్లు లాభాలనూ సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











