MAD 2 Days Collections: మ్యాడ్ మూవీ రికార్డు.. అప్పుడే కోట్ల టార్గెట్ ఫినీష్.. లాభం ఎంతో తెలిస్తే!

గత శుక్రవారం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో నోటెడ్ హీరోస్ చేసిన మూవీలు కూడా ఉన్నాయి. కానీ, కొత్త కుర్రాళ్లే నటించినా ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేసుకున్న సినిమానే 'మ్యాడ్'.

యూత్‌ఫుల్ కాన్సెప్టుతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో లభిస్తోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో 'మ్యాడ్' మూవీ ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

 MAD Movie 2 Days Worldwide Official Box Office Collections

కాలేజ్ స్టోరీతో వచ్చిన మ్యాడ్‌: సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్రేజీ మూవీనే 'మ్యాడ్'. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్‌ను సమకూర్చాడు.

Sangeeth Shobhan, Narne Nithiin and Nithin Ram Did MAD movie

అన్ని కోట్లు బిజినెస్ చేసింది: కాలేజ్ నేపథ్యంతో సాగే కథతో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండో రోజు ఎంత వచ్చింది?: యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన 'మ్యాడ్' మూవీకి మొదటి రోజు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, రెండో రోజు మాత్రం దీనికి మించేలా స్పందన వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ. 1.05 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 2.10 కోట్లు గ్రాస్‌ను కూడా వసూలు చేసి.. రీసెంట్ సినిమాల్లో టాప్ ప్లేస్‌ను చేరుకుంది.

MAD Movie 2 Days Andhra wide collections

2 రోజుల్లో తెలుగు వసూళ్లు: ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఊహించని రీతిలోనే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 1.75 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 3.50 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో కొన్ని రికార్డులను కూడా నమోదు చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: కాలేజ్ నేపథ్యంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ తక్కువ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం రెండు రోజుల్లో 120K డాలర్లు అంటే రూ. 99 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. వీటితో కలిసి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'మ్యాడ్' రూ. 2.40 కోట్లు షేర్‌తో పాటు రూ. 4.7 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

Narne Nithiin Starrer MAD Movie Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?: యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'మ్యాడ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.20 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 2 రోజుల్లోనే ఈ సినిమా రూ. 2.40 కోట్లు రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20 లక్షలు లాభాలనూ సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X