MAD 8 Days Collections: మ్యాడ్‌కు ఊహించని వసూళ్లు.. 8 రోజుల్లోనే అన్ని కోట్లా.. లాభాలు చూస్తే మెంటలే

యూత్‌ఫుల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలు మొత్తం ప్రేక్షకుల నుంచి మంచి స్పందననే సొంతం చేసుకుంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా ఈ మధ్యన వచ్చిన చిత్రాలన్నీ సక్సెస్ సాధించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చి జనాలకు పిచ్చెక్కించిన సినిమానే 'మ్యాడ్'. ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి భారీ స్పందన వస్తూనే ఉంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా రెండో వారంలోనూ ఈ చిత్రం మంచి ఆరంభాన్నే అందుకుంది. ఈ నేపథ్యంలో 'మ్యాడ్' మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత రాబట్టిందో చూడండి!

నవ్వించే కంటెంట్‌తో మ్యాడ్
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన ఫన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'మ్యాడ్'. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. దీనికి భీమ్స్ సంగీతం అందించాడు.

MAD Movie 8 Days Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది
'మ్యాడ్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు క్రమంగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

8వ రోజు ఎంత వచ్చింది?
యూత్‌ఫుల్ కాన్సెప్టుతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, ఎనిమిదో రోజు కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎనిమిదో రోజు రూ. 35 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 70 లక్షలు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టి సత్తా చాటుకుంది.

MAD Movie 8 Days Worldwide Official Box Office Collections

8 రోజుల్లో తెలుగు వసూళ్లు
ముగ్గురు కుర్ర హీరోలు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో ఊహించని రీతిలోనే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 5.47 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 11.80 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో పలు రికార్డులు నమోదు అయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
యువతకు కనెక్ట్ అయ్యే కాన్సెప్టుతో వచ్చిన 'మ్యాడ్' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ తక్కువ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 8 రోజుల్లో 370K డాలర్లు అంటే రూ. 3.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. వీటితో కలిసి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'మ్యాడ్' రూ. 7.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 14.70 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

MAD Movie 8 Days Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మ్యాడ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 8 రోజుల్లోనే ఈ సినిమా రూ. 7.36 కోట్లు రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.86 కోట్లు లాభాలనూ సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X