MAD 9 Days Collections: మ్యాడ్ సంచలనం.. ఏకంగా అన్ని కోట్లతో రికార్డు.. త్రివిక్రమ్ భార్యకు జాక్‌పాట్
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుని సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'మ్యాడ్' ఒకటి. కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఆరంభంలోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా రెండో వారంలోనూ ఇది సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'మ్యాడ్' మూవీ తొమ్మిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!
ఫన్ ఎంటర్‌టైనర్‌గా మ్యాడ్:సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన కామెడీ సినిమానే 'మ్యాడ్'. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. దీనికి భీమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు.

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'మ్యాడ్' మూవీకి ఆరంభంలోనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు క్రమంగా పెరిగిపోయాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. ఫలితంగా గ్రాండ్‌గానే రిలీజ్ అయింది.
9వ రోజు ఎంత వచ్చింది?:యువతకు కనెక్ట్ అయ్యే ఫన్ కంటెంట్‌తో రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభం నుంచీ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక, ఎనిమిదో రోజు కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 9వ రోజు రూ. 95 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 1.80 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టి సత్తా చాటుకుంది.

9 రోజుల్లో తెలుగు వసూళ్లు:ముగ్గురు యువకుల కథతో వచ్చిన 'మ్యాడ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల్లో ఊహించని రీతిలోనే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 6.83 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 13.50 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో పలు రికార్డులు క్రియేట్ అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మ్యాడ్' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ తక్కువ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 9 రోజుల్లో 470K డాలర్లు అంటే రూ. 3.91 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. వీటితో కలిసి 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'మ్యాడ్' రూ. 9.07 కోట్లు షేర్‌తో పాటు రూ. 18 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:యూత్‌ఫుల్ ఫన్ స్టోరీతో తెరకెక్కిన 'మ్యాడ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.50 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. 9 రోజుల్లోనే ఈ సినిమా రూ. 9.07 కోట్లు రాబట్టింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.57 కోట్లు లాభాలనూ సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.


Click it and Unblock the Notifications











