MAD Day 1 Collections: మ్యాడ్ పెను సంచలనం.. తొలి రోజే సగం టార్గెట్ ఔట్.. టోటల్‌గా ఎన్ని కోట్లు అంటే!

యూత్‌ఫుల్ కామెడీతో వచ్చే సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉంటారు. గతంలో ఈ తరహాలో వచ్చిన చాలా చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఇప్పుడలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో క్రేజీ మూవీనే 'మ్యాడ్'. కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆరంభంలోనే హైప్ క్రియేట్ చేసుకుంది. తద్వారా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీనికి మొదటి రోజే అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది. మరి ఎందుకు ఆలస్యం? మ్యాడ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి మరి!

మ్యాడ్‌గా వచ్చిన కుర్ర హీరోలు:సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా రూపొందిన క్రేజీ మూవీనే 'మ్యాడ్'. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ సమర్పణలో హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ వంటి వాళ్లు నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందించాడు.

MAD Movie Day 1 Worldwide Official Box Office Collections

అన్ని కోట్లు బిజినెస్ చేసింది:'హ్యాపీ డేస్', 'జాతి రత్నాలు' వంటి జోనర్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఆరంభంలోనే మంచి గుర్తింపు దక్కింది. దీనికితోడు ఈ సినిమా ప్రచార చిత్రాలతో రెస్పాన్స్ భారీగా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 2.00 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మ్యాడ్' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు చెప్పారు.

MAD Movie Day 1 Worldwide Official Box Office Collections

తెలుగు రాష్ట్రాలో ఎంతంటే:యువ హీరోలు కలిసి నటించిన 'మ్యాడ్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం నైజాం, సీడెడ్, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలనూ కలుపుకుని రూ. 70 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. అలాగే, రూ. 1.35 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టింది. దీంతో చిన్న సినిమా పెను సంచలనం సృష్టించినట్లైంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:కాలేజ్ బ్యాగ్‌డ్రాప్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మ్యాడ్' మూవీకి ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అక్కడ లిమిటెడ్ స్క్రీన్లలోనే ప్రదర్శితం అయిన ఈ చిత్రం 55K డాలర్లు అంటే రూ. 45 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. వీటితో కలిసి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 'మ్యాడ్' రూ. 95 లక్షలు షేర్‌తో పాటు రూ. 1.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

MAD Movie Day 1 Worldwide Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మ్యాడ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 2.20 కోట్లు షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో వచ్చింది. మొదటి రోజే దాదాపు సగం అంటే రూ. 95 లక్షలు రాబట్టింది. ఇక, ఇది హిట్ కావాలంటే మరో రూ. 1.25 కోట్లు షేర్ రాబట్టాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X