Mad Square Closing Collections : మ్యాడ్ స్క్వేర్ క్లోజింగ్ కలెక్షన్లు.. కుర్రాళ్లకు ఎన్ని కోట్ల లాభం?

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రంజాన్ కానుకగా మార్చి 28న గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ లో నటించి మెప్పించారు. 2023లోని మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ ఇది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ దక్కింది. కాగా కుర్రాళ్లకు ఎన్ని కోట్ల లాభం వచ్చింది? అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత కలెక్షన్ల వివరాల విషయానికొస్తే..

మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని నిర్మాతలు హై స్టాండర్డ్స్ తో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, భీమ్స్ సిసిరోలియోలు వర్క్ చేశారు. దాంతో భారీగానే ఖర్చు అయ్యింది. రూ.40 కోట్ల బడ్జెట్‌ తో ఈ మ్యాడ్ స్క్వేర్‌ను నిర్మించి రిలీజ్ చేశారు.

Mad Square Closing Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌ ద్వారా మంచి రేటు పలకడంతో మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబడితేనే లాభాల్లోకి చేరుకుంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాలని నిర్ణయించారు.

19 రోజుల కలెక్షన్లు (Mad Square's 19 days Collections)
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూలైంది. 2వ రోజు రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. 9వ రోజు రూ.2.5 కోట్లు నెట్, 10వ రోజు రూ.2.4 కోట్లు నెట్, 11వ రోజు 85 లక్షల నెట్, 12వ రోజు రూ.75 లక్షలు, 13వ రోజు 75 లక్షలు, 14వ రోజు ఇలా ఫస్ట్ వీక్ లో రూ.38.35 కోట్ల నెట్ రాబట్టింది. సెకండ్ వీక్ లో రూ.9.25 కోట్ల నెట్ అందుకుంది. ప్రస్తుతం 3వ వారంలో అడపదడపా వసూళ్లు రాబడుతోంది. 15వ రోజున 36 లక్షల, 16న రూ.44 లక్షలు, 17న రూ.48 లక్షలు, 18న రూ.29 లక్షలు, 19న రూ.28 లక్షలు అందుకుంది.

మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ (ఇండియా + ఓవర్సీస్) క్లోజింగ్ కలెక్షన్లు..
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వరల్ల్ వైడ్ గా 19 రోజుల వరకు రూ.70.50 కోట్ల వరకు గ్రాస్ వసూల్ అయినట్టు సాక్ నిల్క్ తెలిపింది. ఇప్పటి వరకు 19వ రోజుతో కలిసి ఇండియా నెట్ రూ.49.45 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.58 కోట్లు, ఓవర్సీస్ లో రూ.12.5 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. మరోవైపు ఈ సినిమా 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం.

మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వచ్చిన లాభం ( Mad Square Profit)
మ్యాడ్ స్క్వేర్ ప్రస్తుతం బాక్సాఫీస్ ఇప్పటికీ వసూళ్లు అందుతున్నాయి. కలెక్షన్లు భారీగా తగ్గినా ఈ చిత్రానికి థియేట్రికల్ ద్వారా మంచి ప్రాఫిట్ అందింది. 19వ రోజు వరకు ఈ మూవీ రూ.23 కోట్ల వరకు థియేట్రికల్ రన్ ద్వారా లాభం అందుకుంది. మరోవైపు శాటిలైట్, ఓటీటీ, ఆడియో కలుపుకుంటే రూన.30 కోట్లకు పైనే లాభం ఆర్జించినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. కాగా మొదటి వారంలోనే మ్యాడ్ స్క్వేర్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కలెక్షన్లతో ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల వరకు గ్రాస్ ను ప్రాఫిట్ (లాభం)గా పొందింది.

Disclaimer: ఈ పేజీలోని సినిమా బాక్సాఫీస్‌ రిపోర్టులకు సంబంధించిన సమాచారం https://www.sacnilk.com/, ప్రొడక్షన్ హౌస్‌‌లు, సొషల్ మీడియా అకౌంట్లు వెల్లడించిన వివరాల ఆధారంగా పొందుపరచడం జరిగింది. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల‌కు సంబంధించి వెల్లడించే రిపోర్టులకు ఫిల్మీబీట్ ఎలాంటి బాధ్యత వహించదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X