Mad Square Day 10 Collections : మ్యాడ్ స్క్వేర్ 10వ రోజు కలెక్షన్లు.. రెండో వారంలోనూ అదరగొడుతున్న కుర్రాళ్లు
మ్యాడ్ స్వ్కేర్.. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపోతంది. చిన్న సినిమాగా వచ్చినా వసూళ్లలో ఏమాత్రం తగ్గడం లేదు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. మ్యాడ్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుసకొచ్చారు. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న మ్యాడ్ స్క్వేర్ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత 10 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
మ్యాడ్‌కు సీక్వెల్‌గా వస్తుండటంతో పాటు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకూడదని నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడంతో ఖర్చు బాగానే అయ్యింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
గత 9 రోజుల కలెక్షన్లు (Mad Square's 9 days Collections)
మ్యాడ్ స్క్వేర్‌కు తొలి రోజు రూ. 18 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక రెండో రోజున రూ.7.5 కోట్లు నెట్, మూడో రోజున రూ.10.25 కోట్లు నెట్, నాలుగో రోజున రూ.6.25 కోట్లు నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్లు నెట్, ఆరో రోజున రూ.1.10 కోట్లు, ఏడో రోజున రూ.1.65 కోట్ల నెట్, ఎనిమిదవ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. తొలి వారం నికరంగా రూ.38.35 కోట్లు రాబట్టినట్లు సాక్‌నిల్క్ గణాంకాలు తెలిపాయి. అయితే ఐదు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. 8 రోజుల వరకు మ్యాడ్ స్క్వేర్ భారత్‌లో నికరంగా రూ.310.65 కోట్లు, రూ.42.010 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ వసూళ్లతో ఈ చిత్రం లాభాల బాట పట్టింది. 9వ రోజు 9వ రోజు ఇండియాలో రూ. 2.85 కోట్ల నెట్ వసూళ్లను చేసింది. ఎనిమిదో రోజు వరకు ఇండియాలో నికరంగా రూ.42.75 కోట్లు, రూ.46.6 కోట్ల ఇండియా గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.12 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.58.6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధిస్తోంది. ఓవర్సీస్ నుంచి ఈ 9 రోజుల్లో ఈ సినిమాకు రూ. 12 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. భారత్‌లో వచ్చిన రూ.42.10 కోట్ల గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ రూ.61.5 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇక 9వ మాత్రమే రూ. 2.85 కోట్ల నెట్ అందుకోవడం విశేషంగా మారింది. రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా వసూళ్ల దుమ్ములేపుతోంది.
10వ రోజు కలెక్షన్స్ ( Mad Square's Day 10 Collections)
10వ రోజు ఆదివారం కావడంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లు మరోసారి దుమ్మురేపాయి. శుక్రవారం, శనివారం ఓవరాల్‌గా 25 శాతం వరకు ఆక్యూపెన్సీని నమోదు చేసింది. ఈ మేరకు సాక్‌నిల్క్ నివేదిక అందించింది. ఇక 10వ రోజు ఇండియాలో రూ. 2.50 కోట్ల నెట్ వసూళ్లు చేసినట్టు రిపోర్టుఅందించింది. దీంతో గ్రాస్ రూ.5 కోట్ల వరకు వసూళ్లైంది. దీంతో ఇండియా నెట్ రూ.44.73 కోట్ల చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.53 కోట్ల వరకు అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 68 కోట్ల వరకు సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఓవర్సీస్ లో రూ.12 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ చిత్రం ఇప్పటికే లాభాల భాటలో పయనిస్తోంది. త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది.


Click it and Unblock the Notifications











