Mad Square Day 11 Collections : మ్యాడ్ స్క్వేర్ 11వ రోజు కలెక్షన్లు.. రెండో వారంలో బ్రేకులు.. అయినా

బాక్సాఫీస్ వద్ద మొదటి వారం మంచి పెర్పామెన్స్ కనబర్చింది మ్యాడ్ స్వ్కేర్ చిత్రం. చిన్న సినిమాగా వచ్చినా వసూళ్లలో ఏమాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. మ్యాడ్‌కి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుసకొచ్చారు. మార్నింగ్ షో నుంచే ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 10 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాలు విషయానికొస్తే..

మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
2023లో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా వస్తుండటంతో సినిమా స్టాండర్డ్స్ ను మరింతగా పెంచేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. అందుకు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడంతో ఖర్చు బాగానే అయ్యింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను రూపొందించి తెరకెక్కించారు.

Mad Square Day 11 Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
మ్యాడ్ స్క్వేర్ చిన్న సినిమా అయినప్పటికీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటు దక్కింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

గత 10 రోజుల కలెక్షన్లు (Mad Square's 10 days Collections)

మ్యాడ్‌ స్క్వేర్‌కు ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూల్ వచ్చింది. 2వ రోజున రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా ఫస్ట్ వీక్ లో పూర్తయ్యే సరికి రూ.38.35 కోట్ల నెట్ రాబట్టిందని సాక్ నిల్క్ గణంకాలు తెలిపాయి. కాగా కేవలం 5రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఇక 8వ రోజు 1.55 కోట్లు, 9వ రోజు రూ.2.5 కోట్లు, 10వ రోజు రూ.2.4 కోట్లు వసూళ్లు చేసింది. సెకండ్ వీకెండ్ లో మరింత జోరు చూపించింది. ఇక 10 రోజుల వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.64.30 కోట్ల గ్రాస్, ఇండియాలో రూ.52.30 కోట్ల గ్రాస్, రూ.44.80 కోట్ల నెట్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలియజేస్తోంది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)

ఇక మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతుండటం విశేషం. ఇప్పటికే అక్కడ 1 మిలియన్ డాలర్ వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధిస్తోంది. ఓవర్సీస్ నుంచి 10 రోజుల్లో ఈ సినిమాకు రూ. 12 కోట్ల వరకు వసూళ్లు దక్కాయని సాక్‌నిల్క్ తెలిపింది. రెండో వారం పూర్తవుతుండటంతో ఈ సినిమా ప్రస్తుతం ఓవర్సీస్ లో కాస్తా డల్ అయినట్టు కనిపిస్తోంది.

11వ రోజు కలెక్షన్స్ ( Mad Square's Day 11 Collections)

11వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లు భారీగానే తగ్గాయి. అయినప్పటికీ మంచి వసూళ్లనే అందుకుంది. 11వ రోజు ఇండియా నెట్ రూ.1 కోటీ వసూళ్లు చేయడం విశేషం. దీంతో ఇండియా నెట్ టోటల్ గా రూ.45.80 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.52.3 కోట్లు వరకు పెరిగింది. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు అందుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.64.3 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది. ఇక ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందా? లేదా? అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X