Mad Square Day 12 Collections : మ్యాడ్ స్క్వేర్ 12వ రోజు కలెక్షన్లు.. కుర్రాళ్లకు బిగ్ షాక్
బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'మ్యాడ్' కు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే 'మ్యాడ్ స్క్వేర్'. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ వసూళ్లలో తగ్గలేదు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 12 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాలు విషయానికొస్తే..
మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
2023లో మ్యాడ్ చిత్రం వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ను మరింత స్టాండర్డ్స్ తో తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. అందుకు ఖర్చుకు వెనుకాడలేదు. దాంతో నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడంతో ఖర్చు బాగానే అయ్యింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను రూపొందించి తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్ కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మంచి రేటు వచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాలని టార్గెట్ ఫిక్స్ చేశారు.
గత 11 రోజుల కలెక్షన్లు (Mad Square's 11 days Collections)
ఓపెనింగ్ డేనే మ్యాడ్ స్క్వేర్‌కు రూ.18 కోట్ల గ్రాస్ వసూల్ వచ్చింది. 2వ రోజున రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.38.35 కోట్ల నెట్ రాబట్టిందని సాక్ నిల్క్ గణంకాలు తెలిపాయి.
మరోవైపు కేవలం 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఇక 8వ రోజు 1.55 కోట్లు నెట్, 9వ రోజు రూ.2.5 కోట్లు నెట్, 10వ రోజు రూ.2.4 కోట్లు నెట్, 11వ రోజు 85 లక్షల నెట్ వసూళ్లు చేసింది. దీంతో 11 వ రోజు వరకు 45.65 కోట్ల వరకు ఇండియా నెట్ వసూలైంది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మొదటి వారంలోనే 1 మిలియన్ డాలర్ వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధించింది. ప్రస్తుతం ఓవర్సీస్ నుంచి 12 రోజుల్లో రూ. 12.2 కోట్ల వరకు కోట్ల వరకు వసూళ్లు దక్కాయని సాక్‌నిల్క్ తెలిపింది.
12వ రోజు కలెక్షన్స్ ( Mad Square's Day 12 Collections)
12వ రోజు మంగవారం వర్కింగ్ డే అవడంతో మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్లు కాస్తా ఢీలా పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద కుర్రాళ్ల జోరుకు బ్రేక్ లు పడ్డాయి. 12వ రోజు ఇండియా నెట్ రూ.58 లక్షలు అందుకుంది. దీంతో ఇండియా నెట్ టోటల్ గా రూ.46.23 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ రూ.53.3 కోట్లు వరకు పెరిగింది. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు అందుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.65.5 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ రిపోర్ట్ తెలుపుతోంది. ఓవైపు రూ.100 కోట్ల టార్గెట్ గా పరుగులు తీసుకున్న కుర్రాళ్లు ఇక థర్డ్ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తారనేది చూడాలి.


Click it and Unblock the Notifications











