Mad Square Day 13 Collections : మ్యాడ్ స్క్వేర్ 13వ రోజు కలెక్షన్లు.. నిదానంగా కుర్రాళ్ల వసూళ్లు
'మ్యాడ్' కు సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లు రాబడుతోంది. 2వ వారంలోనూ బాక్సాఫీస్ వసూళ్లను హోల్డ్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 12 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాలు విషయానికొస్తే..
మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
రెండేళ్ల కింద 2023లో మ్యాడ్ చిత్రం వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మరింత స్టాండర్డ్స్ తో తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. అందుకు ఖర్చుకు వెనుకాడలేదు. దాంతో నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడం ద్వారా ఖర్చు అంచనాలకు మించి అయ్యింది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
తొలిరోజే మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మంచి రేటు పలికింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాలని నిర్ణయించారు.
గత 12 రోజుల కలెక్షన్లు (Mad Square's 12 days Collections)
మ్యాడ్ చిత్రానికి మంచి రెస్సాన్స్ ను రావడంతో ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. 2వ రోజు రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా ఫస్ట్ వీక్ లో రూ.38.35 కోట్ల నెట్ రాబట్టింది. మరోవైపు 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఇక 8వ రోజు 1.55 కోట్లు నెట్, 9వ రోజు రూ.2.5 కోట్లు నెట్, 10వ రోజు రూ.2.4 కోట్లు నెట్, 11వ రోజు 85 లక్షల నెట్, 12వ రోజు రూ.75 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. మొదటి వారంలోనే 1 మిలియన్ డాలర్ వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధించింది. ప్రస్తుతం ఓవర్సీస్ నుంచి 13 రోజుల్లో రూ. 12.3 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సాక్‌నిల్క్ తెలిపింది.
13వ రోజు కలెక్షన్స్ ( Mad Square's Day 13 Collections)
13వ రోజు బుధవారం వర్కింగ్ డే అయినప్పటికీ స్టడీగానే వసూళ్లు రాబట్టింది. ముందరి రోజులతో పోల్చితే కాస్తా కలెక్షన్లు తగ్గినా ఓ మాదిరిగా మాత్రం వసూళ్లు సాధిస్తోంది. 13వ రోజు ఇండియా నెట్ రూ.74 లక్షల వరకు రావడం విశేషం. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.కోటీకి పైగా వసూళ్లను అందుకుంది. దీంతో ఇండియా నెట్ టోటల్ గా రూ.47.14 కోట్ల, ఇండియా గ్రాస్ రూ.54.2 కోట్లు వరకు పెరిగింది. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు అందుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.66.5 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











