Mad Square Day 14 Collections : మ్యాడ్ స్క్వేర్ 14వ రోజు కలెక్షన్లు.. 2 వారాల్లో ఎన్ని కోట్ల వసూళ్లో తెలుసా?
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్' కు సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మూవీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లు రాబడుతోంది. తాజాగా 2వ వారం పూర్తి చేసుకుంది. దాంతో ఇప్పటి వరకు పూర్తి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. కాగా, ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 12 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాలు విషయానికొస్తే..
మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
మ్యాడ్ స్క్వేర్ ను స్టాండర్డ్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నించారు. అందుకు ఖర్చుకు వెనుకాడలేదు. దాంతో నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, భీమ్స్ సిసిరోలియోలు వర్క్ చేశారు. దీంతో రూ.40 కోట్ల బడ్జెట్ తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
ఓపెనింగ్ డేనే మ్యాడ్ స్క్వేర్ కు ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. చిన్న సినిమా అయినా మ్యాడ్ స్క్వేర్ కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా మంచి రేటు పలికింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా లాభాల బాటలో పయనిస్తోంది.
గత 13 రోజుల కలెక్షన్లు (Mad Square's 13 days Collections)
ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. 2వ రోజు రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా ఫస్ట్ వీక్ లో రూ.38.35 కోట్ల నెట్ రాబట్టింది. మరోవైపు 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. వారం రోజుల్లో 38.35 కోట్ల నెట్, రూ.80 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక 8వ రోజు 1.55 కోట్లు నెట్, 9వ రోజు రూ.2.5 కోట్లు నెట్, 10వ రోజు రూ.2.4 కోట్లు నెట్, 11వ రోజు 85 లక్షల నెట్, 12వ రోజు రూ.75 లక్షల ఇండియా నెట్, 13వ రోజు రూ.75 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాంతో మొదటి వారంలోనే 1 మిలియన్ డాలర్ వసూల్ చేసింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధించింది. ప్రస్తుతం ఓవర్సీస్ నుంచి 14 రోజుల్లో రూ. 12.45 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సాక్‌నిల్క్ తెలిపింది.
14వ రోజు కలెక్షన్స్ ( Mad Square's Day 14 Collections)
14వ రోజు గురువారం వర్కింగ్ డే అయినా స్టడీగా వసూళ్లు రాబట్టింది. 14వ రోజు ఇండియా నెట్ రూ.45 లక్షల వరకు అందుకుంది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలిపి రూ.90 లక్షల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రెండు వారాలు పూర్తి చేసుకుంది. దీంతో ఇండియా నెట్ టోటల్ గా రూ.47.58 కోట్ల, ఇండియా గ్రాస్ రూ.55.05 కోట్లు వరకు వసూళ్లు పెరిగాయి. ఓవర్సీస్ లో రూ.12.45 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్లు అందుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.67.5 కోట్ల గ్రాస్ అందుకుందని సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ చిత్రం రూ.21 కోట్లకు పైగా లాభాలను ఆర్జించింది.


Click it and Unblock the Notifications











