Mad Square Day 15 Collections : మ్యాడ్ స్క్వేర్ 15వ రోజు కలెక్షన్లు.. 2 వారాల్లో కుర్రాళ్లకు ఎన్ని కోట్ల లాభమో

రెండు వారాలుగా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబడుతూనే ఉంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్' కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. రంజాన్ కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా 2వ వారం పూర్తైంది. ఈ సందర్భంగా కుర్రాళ్లు ఎంత లాభం చూశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 15 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాలు విషయానికొస్తే..

మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
హై స్టాండర్డ్స్ తో మ్యాడ్ స్క్వేర్ చిత్రాన్ని నిర్మాతలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎక్కడా ఖర్చుకు వెనుకాడలేదు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, భీమ్స్ సిసిరోలియోలు వర్క్ చేశారు. దాంతో భారీగానే ఖర్చైవ్వగా, రూ.40 కోట్ల బడ్జెట్‌ తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

Mad Square Day 15 Collections Worldwide

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరోవైపు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌ ద్వారా కూడా మంచి రేటు పలికింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. ఇక మ్యాడ్ స్క్వేర్‌ లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాలని నిర్ణయించారు.

గత 15 రోజుల కలెక్షన్లు (Mad Square's 15 days Collections)
మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఓపెనింగ్ డే రూ.18 కోట్ల గ్రాస్ వసూలైంది. 2వ రోజు రూ.7.5 కోట్లు నెట్, 3వ రోజు రూ.10.25 కోట్లు నెట్, 4వ రోజు రూ.6.25 కోట్లు నెట్, 5వ రోజు రూ.3.3 కోట్లు నెట్, 6వ రోజు రూ.1.10 కోట్లు, 7వ రోజు రూ.1.65 కోట్ల నెట్, 8వ రోజు రూ.1.55 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇలా ఫస్ట్ వీక్ లో రూ.38.35 కోట్ల నెట్ రాబట్టింది. మరోవైపు 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా వెల్లడించడం గమనార్హం. ఇక 8వ రోజు 1.55 కోట్లు నెట్, 9వ రోజు రూ.2.5 కోట్లు నెట్, 10వ రోజు రూ.2.4 కోట్లు నెట్, 11వ రోజు 85 లక్షల నెట్, 12వ రోజు రూ.75 లక్షల ఇండియా నెట్, 13వ రోజు రూ.75 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. 14వ రోజు రూ.45 లక్షల ఇండియా నెట్ అందుకుంది. 15వ రోజున రూ.36 లక్షల నెట్ వసూల్ చేసింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)

ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాంతో మొదటి వారంలోనే 1 మిలియన్ డాలర్ వసూల్ చేసింది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఈ సినిమా మంచి హోల్డ్ సాధించింది. ప్రస్తుతం ఓవర్సీస్ నుంచి 14 రోజుల్లో రూ. 12.45 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని సాక్‌నిల్క్ తెలిపింది.

2 వారాల్లో మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి వచ్చిన లాభం ( Mad Square Two Weeks Profit Collections)

మ్యాడ్ స్క్వేర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద స్టడీగానే వసూళ్లు రాబడుతోంది. ఇండియా గ్రాస్ రూ.56 కోట్లు వసూలైంది. దీంతో ఇండియా నెట్ రూ.47.96 కోట్లు అందింది. ఇక ఓవర్సీస్ లో రూ.12.5 కోట్ల నెట్ వసూలైంది. ఇలా 15 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.68.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణంకాలు తెలుపుతున్నాయి. కాగా మొదటి వారంలోనే మ్యాడ్ స్క్వేర్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన కలెక్షన్లతో ఇప్పటి వరకు రూ.22.5 కోట్ల వరకు గ్రాస్ ను ప్రాఫిట్ (లాభం)గా పొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X