Mad Square Day 3 Collections : మ్యాడ్ స్క్వేర్ డే3 కలెక్షన్లు.. కుర్రాళ్ల ఊచకోత.. వామ్మో ఎన్నికోట్లంటే?
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మార్చి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం రోజురోజుకు ఆసక్తికరంగా కలెక్షన్లను అందుకుంటోంది. 2023లో విడుదలైన 'మ్యాడ్' చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం మరింతగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. మొన్నటి వరకు యువతను ఆకట్టుకున్న ప్రదీప్ రంగనాథన్ చిత్రం తర్వాత ఈ సినిమా యూత్ ను ఆ స్థాయిలోనే ఆకట్టుకుంటోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల మార్క్ ను చేరుకోవడం ఆసక్తికరంగా మారింది.
థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అంచనాల ప్రకారమే మంచి రెస్సాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ రెస్పాన్స్ ను పరిశీలిస్తే.. డే1న వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి 17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇక ఇండియాలో మాత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే2న కూడా అదే రేంజ్ లో వసూళ్లు అందుకుంది. ఫస్ట్ వీకెండ్ లో మొదటి శనివారం కావడంతో జోరుగానే వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.8.6 కోట్ల నెట్ అందుకుంది. ఓవర్సీస్, ఇతర లెక్కలు కలుపుకొని రెండో రోజు వరకు బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ ను అందుకుంది.

ఇక తాజాగా డే3న కూడా ఆసక్తికరంగా వసూళ్లు అందాయి. ఆదివారం కావడంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లు అందినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మూడో రోజు వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రెడ్ నిపుణులు టీ2బీలైవ్ తెలుపుతున్నారు. ఇలా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.27.5 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు అందుకుందని తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే వరల్డ్ వైడ్ గా రూ.42 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని తెలుస్తోంది.
అయితే చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ వసూళ్లను రాబడుతోంది. యువ నటులు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేస్తూ రోజురోజుకు వసూళ్లను పెంచుకుంటూ పోతున్నారు. మరోవైపు పెద్ద సినిమాల పోటీ లేకుంటే మాత్రం మొదటి వీకెండ్ లోనే మ్యాడ్ స్క్వేర్ రూ.50 కోట్ల మార్క్ ను దాటేసేదని అంటున్నారు. 'L2 : ఎంపురాన్', నితిన్ రాబిన్ హుడ్, చియాన్ విక్రమ్ వీర ధీర శూర.. వంటి చిత్రాలు పార్లల్ గా రన్ అవుతుండటంతో మున్ముందు ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











