Mad Square Day 4 Collections : మ్యాడ్ స్క్వేర్ డే4 కలెక్షన్లు.. మెంటల్ ఎక్కిస్తున్న కుర్రాళ్లు.. సెన్సేషన్
మ్యాడ్ స్క్వేర్ చిత్రం ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లవ్, కామెడీ, యూత్ కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 2023లో వచ్చిన 'మ్యాడ్' చిత్రానికి ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. మార్చి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి పెర్ఫామెన్స్ ను చూపిస్తోంది. కాగా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
డే1న వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి రూ.17 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే2న ఫస్ట్ వీకెండ్ లో మొదటి శనివారం కావడంతో అదే రేంజ్ లో వసూళ్లు అందుకుంది. ఇండియాలో రూ.8.6 కోట్ల నెట్ అందుకుంది. ఓవర్సీస్, ఇతర లెక్కలు కలుపుకొని రెండో రోజు బాక్సాఫీస్ వద్ద రూ.28.50 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక డే3 వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ అందుకుందని టీ2బీ లైవ్ అప్డేట్ ఇచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.22.99 కోట్ల వరకు నెట్ వసూళ్లు చేసిందని కూడా తెలిపింది.

అయితే, ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకొని సంచలనంగా మారింది. 22 కోట్ల వాల్యూతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అవ్వగా డే3నే పూర్తి చేసింది. 99 లక్షల లాభం కూడా పొందింది. ఇక ఓవర్సీస్ లోనూ డే3 వరకు 1 మిలియన్ డాలర్లు అందుకొని మీడియం రేంజ్ సినిమాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు ఓవర్సీస్, నిజాంలోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో మూడు రోజుల్లోనే రూ.55.2 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని కూడా ప్రకటించారు.
ఇక డే4న సోమవారం వర్కింగ్ డే కావడంతో ఈ చిత్రం వసూళ్లు కాస్తా డ్రాప్ అయినట్టు తెలుస్తోంది. ఇండియాలో మాత్రం రూ.6 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్, ఇతర ఏరియా లెక్కలు కలుపుకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.31.25 కోట్లుగా సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్టును వెల్లడించింది. ఇక మ్యాడ్ స్క్వేర్ ఇలా వసూళ్ల పరంగా మాత్రం దుమ్ములేపుతోంది. మొదటి వీకెండ్ లోనే ప్రాఫిట్ బాటలోకి వచ్చి సెన్సేషన్ గా మారింది.
ఓవైపు 'L2 : ఎంపురాన్', నితిన్ రాబిన్ హుడ్, చియాన్ విక్రమ్ వీర ధీర శూర.. చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం వసూళ్ల పరంగా ఎక్కడా తగ్గడం లేదు. పెద్ద ఎత్తున కాకున్నా డీసెంట్ గా వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకుడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పకులు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











