Mad Square Day 4 Collections: 50 కోట్లు కుమ్మేసిన మ్యాడ్ స్క్వేర్.. 4వ రోజు ఎన్ని కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకుడిగా వ్యవహారించారు. యువ దర్శకుడు కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలో నటించారు. గతేడాది రూపొందిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ సినిమాకు అద్బుతమైన విజయం దక్కడంతో ఏడాది వ్యవధిలోనే మ్యాడ్ స్క్వేర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ఎక్కువగా గోవాలోను, హైదరాబాద్ సెట్స్‌లోను చిత్రీకరించారు. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్సాన్స్ రావడంతో ఈ సినిమాకు బిజినెస్‌ను హై లెవెల్ వాల్యూ కల్టారు.

మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. మ్యాడ్ మూవీ కంటే భారీగా జరిగింది. ఈ సినిమా ఏపీ, నైజాం థియేట్రికల్ హక్కులు 16 కోట్ల రూపాయలు, ఓవర్సీస్, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 6 కోట్లకు అమ్మడం జరిగింది. ఈ సినిమా సుమారుగా 22 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మ్యాడ్ స్క్వేర్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ తొలి రోజు ఇండియాలో 8.5 కోట్ల రూపాయలు నెట్, ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు ఇండియాలో 7.5 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్, మూడో రోజు 9.25 కోట్లు నెట్, ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడు రోజుల్లో ఇండియాలో 31 కోట్ల రూపాయలు, 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 7 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











