Mad Square Day 5 Collections : మ్యాడ్ స్క్వేర్ డే5 కలెక్షన్లు.. 70 కోట్ల మార్క్.. లాభాల్లోకి కుర్రాళ్ల జర్నీ
ప్రస్తుతం యువతను ఆకట్టుకుంటున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్. లవ్, కామెడీ, యూత్ కంటెంట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఆడియెన్స్ జై కొడుతున్నారు. యువతను నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 2023లో వచ్చిన 'మ్యాడ్' మూవీకి ఇది సీక్వెల్. మార్చి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా మ్యాడ్ స్వ్కేర్ రిలీజ్ అయ్యి థియేట్రికల్ రన్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. రోజురోజుకు ఈ సినిమాకు ప్రేక్షకాదరణ పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది.
సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. మ్యాడ్ స్క్వేర్ బాక్సాఫీస్ వసూళ్ల రిపోర్ట్ ఇలా ఉంది. డే1న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.18 కోట్ల గ్రాస్ అందింది. ఇండియాలో రూ.8.5 కోట్ల నెట్, రూ.10.10 కోట్ల గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్ లో రూ.7.90 కోట్లు వసూళ్లు చేసింది. డే2న 7.5 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసింది. డే3న 9.25 కోట్ల వరకు ఇండియా నెట్, డే4న రూ.6.25 కోట్ల నెట్ అందుకుంది. ఇక మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ.3.35 కోట్ల నెట్ అందుకుంది. వీటికి మరిన్ని లెక్కలు కలవాల్సి ఉంది. దాంతో 4 కోట్ల వరకు నెట్ అంది ఉంటుందని తెలుస్తోంది.

ఇలా డే5 వరకు మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఇండియా నెట్ 34.85 కోట్ల వరకు చేరుకుంది. కాగా, ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే 1 మిలియన్ డాలర్ ను వసూళ్ చేసి అక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకుంది. అలాగే నైజాం ఏరియాలోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది. మిగితా ఏరియాల్లో కొద్దిపాటి కలెక్షన్లతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి లాభాల బాటలో పయనించనుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.1.5 కోట్లకు పైగా లాభాన్ని గడించింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో మున్ముందు మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు నిర్మాతలు ఇప్పటికే ఈ చిత్రం రూ.50 కోట్లలోకి ఎంట్రీ ఇచ్చిందని, మూడో రోజేనే ఈ మార్క్ వసూళ్లను కలెక్ట్ చేసిందని తెలిపారు. 4వ రోజు వరకు ఏకంగా రూ.69.4 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసిందని ప్రకటించారు. అలాగే వసూళ్ల లెక్కల్లో ఎలాంటి తేడాలు లేవని స్పష్టం చేశారు. సినిమాకు మంచి కలెక్షన్లు అందుతున్నాయని, ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450, వరల్డ్ వైడ్ గా 650 థియేటర్లలో విడుదలై సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది.
ఈ మూవీకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. హీరోలుగా నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించారు. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.


Click it and Unblock the Notifications











