Mad Square Day 6 Collections : 100 కోట్ల దిశగా .. కుర్రాళ్ల దెబ్బకి బాక్సాఫీస్ షేక్, ఆరో రోజు ఎన్ని కోట్లంటే?
2023లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'కి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. మ్యాడ్ స్క్వేర్‌కు ఇద్దరు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, ఎస్ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పనిచేశారు.
ప్రియాంక జువాల్కర్, సునీల్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేశ్, రఘుబాబు, మురళీధర్ గౌడ్‌లు కీలకపాత్రలు పోషించారు. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 650 థియేటర్లు, తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్‌లలో మ్యాడ్ స్క్వేర్‌ను రంజాన్ కానుకగా మార్చి 28న విడుదల చేశారు.
మ్యాడ్ స్కేర్ వసూళ్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజు రూ. 18 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండో రోజున రూ.7.5 కోట్లు, మూడో రోజున రూ.9.25 కోట్లు, నాలుగో రోజున రూ.6.25 కోట్లు, ఐదో రోజున రూ.3.3 కోట్లు రాబట్టింది. ఐదు రోజుల వరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్ధ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీనిని బట్టి మ్యాడ్ స్క్వేర్ లాభాల్లోకి అడుగుపెట్టినట్లయ్యింది.

డబ్బింగ్ చిత్రాలైన ఎల్ 2 : ఎంపురాన్, వీర ధీర శూర, హిందీ చిత్రం సికందర్, నితిన్ నటించిన రాబిన్‌హుడ్ చిత్రాలు పోటీ ఇస్తున్నప్పటికీ ఈ చిన్న చిత్రం ఘన విజయం సాధించింది. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు, మ్యూజిక్, కథ కథనాలతో మ్యాడ్ స్క్వేర్ దూసుకెళ్తోంది.
ఇక ఆరో రోజు మ్యాడ్ స్క్వేర్ వసూళ్ల విషయానికి వస్తే.. బుధవారం ఓవరాల్‌గా 17.72 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. మ్యాట్నీలకు 20.51 శాతం, సెకండ్ షోలకు 18.52 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 446, బెంగళూరులో 241, విశాఖలో 112, విజయవాడలో 86 షోలు పడినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఆరో రోజు ఈ సినిమా రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు వెల్లడించింది. మొత్తంగా ఆరు రోజుల వరకు మ్యాడ్ స్క్వేర్ ఇండియాలో రూ.40.7 గ్రాస్ .. నికరంగా రూ.36.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.11.8 కోట్ల వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.52.5 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు సాక్‌నిక్ తెలిపింది.
ఈ వసూళ్లతో 2025లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న తెలుగు చిత్రాల్లో మ్యాడ్ స్క్వేర్ ఆరో స్థానంలో నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, తండేల్, కోర్ట్ చిత్రాలు దీని కంటే ముందున్నాయి. ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











