Mad Square Day 7 Collections : స్లో అండ్ స్టడీగా వసూళ్ల జాతర .. వర్కింగ్ డే లోనూ హవా.. ఎన్ని కోట్లంటే?
'మ్యాడ్'కి సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించారు. టఫ్ ఫైట్ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత 7 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
మ్యాడ్‌కు సీక్వెల్‌గా వస్తుండటంతో పాటు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకూడదని నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడంతో ఖర్చు బాగానే అయ్యింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
గత 6 రోజుల కలెక్షన్లు (Mad Square's 6 days Collections)
మ్యాడ్ స్క్వేర్‌కు తొలి రోజు రూ. 18 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక రెండో రోజున రూ.7.5 కోట్లు నెట్, మూడో రోజున రూ.9.25 కోట్లు నెట్, నాలుగో రోజున రూ.6.25 కోట్లు నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్లు నెట్, ఆరో రోజున రూ.1.9 కోట్లు నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. అయితే ఐదు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఎక్స్ ద్వారా ప్రకటించింది. దీనిని బట్టి మ్యాడ్ స్క్వేర్ లాభాల్లోకి అడుగుపెట్టినట్లయ్యింది. మొత్తంగా ఆరు రోజుల వరకు మ్యాడ్ స్క్వేర్ భారతదేశంలో రూ.40.7 గ్రాస్ .. నికరంగా రూ.36.62 కోట్లు రాబట్టింది.
ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)
ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మార్నింగ్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకున్న మ్యాడ్ స్క్వేర్‌కు ఓవర్సీస్ నుంచి రూ. 11.8 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఈ వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.52.5 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.
7వ రోజు కలెక్షన్స్ ( Mad Square's day 7 Collections)
ఏడవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్ మంచి హోల్డ్ సాధించింది. గురువారం ఓవరాల్‌గా 14.99 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ నివేదించింది. ఏడో రోజు ఇండియాలో రూ. 1.28 కోట్ల నెట్ వసూళ్లను మ్యాడ్ స్క్వేర్ రాబట్టింది. దీనితో కలిపి మొత్తంగా ఈ చిత్రంలో భారత్‌లో నికరంగా రూ.37.98 కోట్లు కలెక్ట్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఏడు రోజుల వరకు ఇండియాలో రూ.42.9 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.11.85 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.54.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. త్వరలో వీకెండ్ ప్రారంభం కానుండటంతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











