Mad Square Day 8 Collections : 100 కోట్లపై కన్ను.. టార్గెట్ దిశగా కుర్రాళ్లు, మ్యాడ్ స్క్వేర్‌కు ఎన్ని కోట్లంట

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లు లీడ్ రోల్స్ పోషించిన చిత్రం మ్యాడ్ స్వ్కేర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితం సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టిన మ్యాడ్‌కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక స్యూరదేవర, సాయి సౌజన్యలు నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా గత 8 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Mad Square Day 8 Collections Worldwide sangeeth shobhan movie heading towards 100 crores mark

మ్యాడ్ స్క్వేర్ బడ్జెట్ ఎంత (Mad Square Budget)?
మ్యాడ్‌కు సీక్వెల్‌గా వస్తుండటంతో పాటు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకూడదని నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. నటీనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. అలాగే ఇద్దరు సంగీత దర్శకులు థమన్, భీమ్స్ సిసిరోలియోలు మ్యాడ్ స్క్వేర్ కోసం వర్క్ చేయడంతో ఖర్చు బాగానే అయ్యింది. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (Mad Square Break Even Target)?
చిన్న సినిమా అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్‌కు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి రేటొచ్చింది. తద్వారా ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ వద్ద సులభమైంది. మ్యాడ్ స్క్వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.23 కోట్ల షేర్.. రూ.46 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో రూ.16 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

గత 7 రోజుల కలెక్షన్లు (Mad Square's 7 days Collections)

మ్యాడ్‌ స్క్వేర్‌కు తొలి రోజు రూ. 18 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక రెండో రోజున రూ.7.5 కోట్లు నెట్, మూడో రోజున రూ.9.25 కోట్లు నెట్, నాలుగో రోజున రూ.6.25 కోట్లు నెట్, ఐదో రోజున రూ.3.3 కోట్లు నెట్, ఆరో రోజున రూ.1.9 కోట్లు, ఏడో రోజున రూ.1.65 కోట్ల నెట్ వచ్చినట్లు సాక్‌నిల్క్ వెబ్‌సైట్ వెల్లడించింది. మొత్తంగా తొలి వారం నికరంగా రూ.38.35 కోట్లు రాబట్టింది. అయితే ఐదు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా రూ.74 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు నిర్మాణ సంస్ధ సితార ఎంటర్‌టైన్మెంట్స్ వెల్లడించింది. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే మ్యాడ్ స్క్వేర్ లాభాల్లోకి దూసుకొచ్చింది. మొత్తంగా 7 రోజుల వరకు మ్యాడ్ స్క్వేర్ భారతదేశంలో రూ.38.35 కోట్ల నెట్, రూ.42.9 గ్రాస్ అందుకుంది.

ఓవర్సీస్‌లో కలెక్షన్లు (Overseas Collections)

ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా మ్యాడ్ స్క్వేర్‌ను బాగానే ఆదరిస్తున్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ఈ సినిమాకు మంచి రిపోర్టే వస్తోంది . ఓవర్సీస్ నుంచి ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు రూ. 11.85 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. భారత్‌లో వచ్చిన రూ.42.9 కోట్ల గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్ల కలిపి ప్రపంచవ్యాప్తంగా మ్యాడ్ స్క్వేర్ రూ.53.24 కోట్ల కలెక్షన్స్ అందుకుంది.

8వ రోజు కలెక్షన్స్ ( Mad Square's day 8 Collections)

8వ రోజు శుక్రవారం కొద్దిమేర బుకింగ్స్ డ్రాప్ అయినప్పటికీ మ్యాడ్ స్క్వేర్ మంచి హోల్డ్ సాధించింది. శుక్రవారం ఓవరాల్‌గా 15.31 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిల్క్ నివేదించింది. ఎనిమిదవ రోజు ఇండియాలో రూ. 1.60 కోట్ల నెట్ వసూళ్లను మ్యాడ్ స్క్వేర్ రాబట్టింది. దీనితో కలిపి మొత్తంగా ఈ చిత్రంలో భారత్‌లో నికరంగా రూ.39.95 కోట్లు కలెక్ట్ చేసింది. మ్యాడ్ స్క్వేర్ ఏడు రోజుల వరకు ఇండియాలో రూ.44 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.11.85 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.54.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే లాభాలను అందుకున్న ఈ సినిమా రానున్న రోజుల్లో ఇంకెంత వసూలు చేస్తుందోనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X