Mad Movie Collections చిన్న సినిమాకు భారీ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్ల కలెక్షన్లు రాబట్టిందంటే?
ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్య దేవర తొలిసారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సమర్పకుడిగా నిర్మించిన చిత్రం మ్యాడ్ (MAD). సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, రఘుబాబు, అనుదీప్ కేవీ, అంథోని తదితరులు నటించిన చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ (MAD) సినిమా విషయానికి వస్తే.. అంతా కొత్తవారితో తెరకెక్కించారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్ల ఎక్కువగా ఖర్చు చేశామని నిర్మాత నాగవంశీ చెప్పారు.

మ్యాడ్ (MAD) సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమా ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ లభించింది. రిలీజ్‌కు ముందు ప్రదర్శించిన ప్రీమియర్లకు ఫుల్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఇలాంటి క్రేజ్ మధ్య ఈ సినిమా ఇండియాలో 1000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 100 స్క్రీన్లలో అంటే ప్రపంచవ్యాప్తంగా 1100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.
మ్యాడ్ (MAD) సినిమా ఫన్, హ్యుమర్ అంశాలకు పెద్ద పీట వేయడంతో హిలేరియస్ కామెడీ చిత్రమని తొలి ఆట నుంచే టాక్ లభించింది. దాంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మీడియం ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
మ్యాడ్ (MAD) సినిమాకు తొలి రోజు కలెక్షన్లు పాజిటివ్‌గానే నమోదు అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ సానుకూలంగా ప్రారంభమైందనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 1 కోటి రూపాయల షేర్, ఓవర్సీస్‌లో 50 లక్షల షేర్ రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తొలి రోజు 1.5 కోట్ల మేర షేర్, 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

మ్యాడ్ చిత్రం తొలి రోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువగా కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు 2.8 కోట్లు, మూడో రోజు 3.6 కోట్లు, నాలుగో రోజు 1.55 కోట్ల రూపాయలు, 5వ రోజు 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా అమెరికాలో 300K డాలర్లు అంటే 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం గత 5 రోజుల్లో 11 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
మ్యాడ్ (MAD) సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా బిజినెస్ 10 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయలు షేర్, 20 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











