MAD 3 days Collections మ్యాడ్ మూవీ 3 రోజుల్లో లాభాల్లోకి.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
యువ హీరో, హీరోయిన్లు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, రఘుబాబు, అనుదీప్ కేవీ, అంథోని తదితరులు నటించిన చిత్రం మ్యాడ్ (MAD). ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్య దేవర తొలిసారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సమర్పకుడిగా నిర్మించిన చిత్రానికి నూతన దర్శకుడు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6వ తేదీన భారీ అంచనాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ మూవీ బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. మీడియం రేంజ్ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. నటీనటులు కొత్తవాళ్లైనా, సాంకేతి అంశాలతో రాజీ పడలేదని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మ్యాడ్ (MAD) సినిమా టీజర్లు, గ్లింప్స్, ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీకి భారీ బజ్ ఏర్పడింది. డిమాండ్ ఎక్కువగా కనిపించడంతో చిన్న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను నైజాంలో 300 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 350 స్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1500 స్క్రీన్లలో విడుదల చేయడం గమనార్హం.
మ్యాడ్ (MAD) సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు కంటే రెండు రోజు అధికంగా వసూళ్ళను రాబట్టింది. అలాగే రెండో రోజు కంటే మూడో రోజు అత్యధికంగా కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది.
మ్యాడ్ (MAD) మూవీ తొలి రోజు కలెక్షన్లు అతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఈ సినిమా ఫస్ట్ డే 95 కోట్ల షేర్ సాధించగా.. 1.8 గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఓవర్సీస్‌లో 50 వేల డాలర్లు అంటే.. సుమారుగా 45 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ సినిమా 2.8 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. దాంతో గత రెండు రోజుల్లో 2.7 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక మ్యాడ్ (MAD) మూవీ మూడు రోజు గత రెండు రోజుల కంటే ఎక్కువగా వసూళ్లను నమోదుచేసింది. ఈ సినిమా మూడో రోజు 3.6 కోట్ల గ్రాస్ వసూలు చేుసింది. ఓవర్సీస్‌లో 3 రోజుల్లో 2 లక్షల డాలర్లు అంటే.. 1.6 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 5.65 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

మ్యాడ్ (MAD) చిత్రం ట్రేడ్ అంచనాలు, వ్యాల్యూ ప్రకారం.. 8 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పటికే లాభాలకు చేరువైంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను టచ్ చేసే అవకాశం ఉంది. చిన్న సినిమాగా రిలీజై భారీ లాభాలను సొంతం చేసుకొన్న ఈ సినిమా థియేట్రికల్ రన్ నిలకడగా కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











