Mad Movie Collections మ్యాడ్ మూవీకి లాభమా? నష్టమా? 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన యువ నటీనటులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, ప్రియా గౌరీ రెడ్డి, గోపిక, అనంతిక నటించిన మ్యాడ్ (MAD) చిత్రం భారీ సక్సెస్ కోసం బాక్సాఫీస్ వద్ద ఉరకలేస్తున్నది. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణ చూపించడంతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమా గత 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
జాతి రత్నాలు తరహా కామెడీ అంటూ మ్యాడ్ (MAD) సినిమా రిలీజ్‌కు ముందు యూనిట్ భారీగా ప్రచారం చేయడంతో ఈ మూవీపై కొంత అటెన్షన్ క్రియేట్ చేసింది. అలాగే క్లీన్ సినిమాలు తీసే హారిక, హాసిని బ్యానర్ నుంచి ఈ సినిమా రావడంతో అందరి దృష్టి పడింది. ఇక టీజర్, ట్రైలర్ కనెక్ట్ కావడంతో ఈ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది.

మ్యాడ్ (MAD) చిత్రాన్ని నూతన నటీనటులతో రూపొందించినప్పటికీ.. ఖర్చుకు వెనుకాడకుండా మంచి లొకేషన్స్, క్వాలిటీ మేకింగ్‌కు మొగ్గు చూపడంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 10 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాకు భారీగా క్రేజ్ రావడంతో సుమారుగా 1500 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. దాంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగా నమోదైంది.

మ్యాడ్ (MAD) సినిమాకు తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ పెరగడంతో కలెక్షన్లు క్రమంగా పుంజుకొన్నాయి. మొదటి రోజు కంటే.. ఆ తర్వాత కలెక్షన్లు రావడం ఈ సినిమా బలాన్ని చెప్పింది. పలు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తూ వస్తున్నది.
మ్యాడ్ (MAD) సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా నమోదు అవుతున్నాయి. మొదటి రోజు 1.8 కోట్లు, రెండో రోజు 2.8 కోట్లు, మూడో రోజు 3.6 కోట్లు, నాలుగో రోజు 1.55 కోట్ల రూపాయలు, 5వ రోజు 1.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 8 కోట్ల షేర్ వసూలు చేసింది.
మ్యాడ్ (MAD) చిత్రానికి అమెరికాలో కూడా భారీగా రెస్సాన్ లభిస్తున్నది. తొలి రోజు, ప్రీమియర్లతో కలిపి 50K డాలర్లు అంటే 42 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత 5 రోజుల్లో ఈ సినిమా దాదాపు 300K అంటే.. 2.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా దాదాపు బ్రేక్ ఈవెన్‌కు చేరువైంది.

మ్యాడ్ (MAD) సినిమా గురించి ట్రేడ్ వర్గాలు వెల్లడించిన బ్రేక్ ఈవెన్ వాల్యూ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 8 కోట్ల రూపాయాల షేర్ సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సినిమా ఈ వారం ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ట్రేడ్ వర్గాల్లో జోష్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











