Madame Web Collections డిజాస్టర్ కా బాప్.. 950 కోట్ల బడ్జెట్.. మేడమ్ వెబ్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కొలంబియా పిక్సర్స్, మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర నిర్మాణ సంస్థలు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం మేడమ్ వెబ్. డకోటా జాన్సన్, సిడ్నీ స్వీనీ, ఇసబెల్లా మెర్సెడ్, సెలెస్టే ఓకానర్, ఇమ్మా రాబర్ట్స్, ఆడమ్ స్కాట్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎస్‌జే క్లార్క్సన్ దర్శకత్వం వహించగా లారెంజో డీ బోనావెంచురా నిర్మాతగా వ్యవహరించారు. ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సూపర్ హీరో సినిమాలకు భారీగా ఆదరణ, ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉండటంతో ఊహకు అందని బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. ఈ సినిమాను కూడా సుమారుగా 115 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిస్తే.. అంటే సుమారుగా ఇండియన్ కరెన్సీలో 950 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందిస్తున్నది.

ఇండియాలో మేడమ్ వెబ్ చిత్రానికి ఊహించని ఎదురు దెబ్బ తగలింది. ఈ చిత్రం అత్యంత పేలవంగా కలెక్షన్లను సాధిస్తుండటం ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నది. ఈ సినిమా ఇండియా కలెక్షన్లు నాసిరకంగా ఉండటంతో స్పైడర్ మ్యాన్ యూనివర్స్‌లో సూపర్ హీరో మూవీ డిజాస్టర్ దిశగా ప్రయాణిస్తున్నది.
ఇండియాలో మేడమ్ వెబ్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 80 లక్షల రూపాయలు, రెండో రోజు 1.20 కోట్లు, మూడో రోజు 1.25 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు 70 లక్షలు, 5వ రోజు 50 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో ఇప్పటి వరకు 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా మేడమ్ వెబ్ చిత్రానికి కూడా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సినిమా నార్త్ అమెరికాలో, ఇతర దేశాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 55 మిలియన్ డాలర్లు అంటే.. 456 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దాంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) జోనర్‌లోనే అత్యంత దారుణమైన ఫెయిల్యూర్‌గా మిగిలే అవకాశం ఉంది.
గతంలో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, సూపర్ హీరోస్ సినిమాలకు అత్యంత ఆదరణ ఉండేది. రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టించేవి. కానీ కరోనా పాండమిక్ తర్వాత ఇలాంటి సినిమాలు దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇటీవల వచ్చిన ఎంసీయూ మూవీస్ పేలవమైన ప్రదర్శనతో డిజాస్టర్‌గా మారడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











