3 సినిమాలు 120 కోట్ల బడ్జెట్,1100 కోట్ల కలెక్షన్లు.. కోట్లు కొలాకొట్టిన నిర్మాత ఎవరంటే?

ఈ ఒక్క ఏడాదిలోనే ఇండియన్ సినిమా చూడని హై మూమెంట్ లేదు అలాగే లో మూమెంట్ కూడా లేదని చెప్పాలి. కాగా గడిచిన కొన్నేళ్లలో కరోనా తర్వాత కొన్నాళ్ల పాటు థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ చాలా మంది జనం థియేటర్స్ లోకి రాలేదు. దీనితో చాలా డ్రై వాతావరణం కనిపించింది. ఇది నెలల పాటు కొనసాగింది. కానీ అప్పుడు పరిస్థితులు అలా అనుకోవచ్చు కానీ మళ్ళీ మొత్తం సెట్టయ్యాక కూడా థియేటర్స్ కి జనం రావడం తగ్గించారు.

ఇది కూడా ఈ 2024 లోనే జరిగింది. దీనితో అంతా తలలు పట్టుకున్నారు. సరే ఇదిలా ఉండగా ఈ ఏడాదిలోనే దాదాపు అన్ని ఇండస్ట్రీ లలో కూడా సరైన సినిమాలు కొంత కాలం లేక బాగా డ్రై నడిచింది. కానీ కొన్నిటిలో కూడా హిట్ అయితే మాత్రం రికార్డు వసూళ్లనే సొంతం చేసుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాదిలో పలు హై బడ్జెట్ సినిమాలు వచ్చాయి..

maddock films got 1100 crore boxoffice with only 120 crore budget 3 films

కానీ హిందీ మార్కెట్ నుంచి వచ్చిన లో బడ్జెట్ సినిమాలు అది కూడా ఒకే నిర్మాణ సంస్థ నుంచి వచ్చి కాసుల పంట పండించాయి. కాగా ఆ నిర్మాణ సంస్థే మాడాక్ ఫిల్మ్స్. బాలీవుడ్ కి చెందిన ఈ నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాదిలో పలు చిత్రాలు వచ్చాయి. కానీ వాటిలో మూడు సినిమాలు మాత్రం బాలీవుడ్ లో రికార్డు వసూళ్లు కొల్లగొట్టాయని చెప్పాలి.

మొదటిగా వీరి నుంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం "తేరి బాతో మెయిన్ ఐసా ఉల్జా జియా" అనే సినిమా షాహిద్ కపూర్ అలాగే కృతి సనన్ కలయికలో విడుదలకి వచ్చి 130 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంది. కాగా దీని బడ్జెట్ కేవలం 50 కోట్ల లోపే అట.. అలాగే దీని తర్వాత రెండు సెన్సేషనల్ హారర్ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాలు "ముంజ్య" అలాగే "స్త్రీ 2" లు.

మరి వీటిలో ముంజ్య కేవలం 20 కోట్ల బడ్జెట్ తోనే తెరకెక్కించగా ఇది సర్ప్రైజింగ్ గా 130 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ ని అందుకుంది. అలాగే స్త్రీ 2 సెట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు ఇది కేవలం 50 కోట్ల బడ్జెట్ లోనే తెరకెక్కగా దీనికి వరల్డ్ వైడ్ ఏకంగా 850 కోట్లకి పైగా గ్రాస్ వచ్చి స్టిల్ థియేటర్స్ లో రన్ అవుతుంది.

ఇలా కేవలం 120 కోట్ల బడ్జెట్ లోనే వచ్చిన ఈ మూడు చిత్రాలు వరల్డ్ వైడ్ 1100 కోట్లకి పైగా వసూళ్లు అందుకోవడం విశేషం అయితే ఈ మూడు సినిమాలు కూడా ఒకే నిర్మాణ సంస్థ నుంచి రావడం మరో విశేషం ఇలా ఈ మూడు సినిమాలతో మాత్రం మేకర్స్ ఈ ఏడాదిలో భారీ లాభాలు అందుకున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మరి 120 కోట్ల బడ్జెట్ కి 1100 కోట్లకి పైగా గ్రాస్ ని చూస్తే ఇందులో షేర్ సగం కూడా 550 కోట్లకి పైగా లాభం మేకర్స్ వచ్చినట్టే అని చెప్పాలి. దీనితో మడాక్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ కొట్టిన జాక్ పాట్ కోసం సినీ వర్గాల్లో మంచి వైరల్ గా హాట్ టాపిక్ నడుస్తుంది.

More from Filmibeat

Read more about: munjya shraddha kapoor stree 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X