25 కోట్ల బడ్జెట్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. ప్రేక్షకులు ముఖం చాటేసిన మూవీ మీకు తెలుసా?

బాలీవుడ్ నటుడు కునాల్ కేము దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం మడగావ్ ఎక్స్‌ప్రెస్. ఈ చిత్రంలో అవినాష్ తివారీ, ప్రతీక్ గాంధీ, దివ్యేందు తదితరులు నటించారు. మార్చి 22వ తేదీన భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద అంతంతా మాత్రంగానే కలెక్షన్లు సాధిస్తున్నది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని ప్రకటన చేసినా ప్రేక్షకులు థియేటర్లకు ముఖం చాటేశారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మ్యాడగావ్ ఎక్స్‌ప్రెస్ సినిమాను యువ హీరోలు, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తోపాటు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందించారు. గోవా తదితర ప్రాంతాల్లో షూట్ చేయడం వల్ల బడ్జెట్ ఎక్కువగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఫినిష్ చేశారు. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 25 కోట్ల రూపాయలు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Madgaon Express Day 4 Expected Box Office Collections Worldwide

ఇక కునాల్ కేము నటుడిగా ఉన్న క్రేజ్‌తోపాటు డైరెక్టర్‌గా సినిమా రూపొందించారనే అంశంతో అంచనాలు ఎక్కువగానే ఉండేవి. దాంతో ఈ సినిమాను సుమారుగా 2200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ఫ్రీ టికెట్ స్కీమ్ పెట్టినా పెద్దగా ఆక్యుపెన్సీ నమోదు కాలేదనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తారు ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు 1.65 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.75 కోట్లు, మూడో రోజు 2.85 కోట్లు ఇండియాలో రాబట్టింది. దాంతో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 7.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే ఈ రేంజ్‌లో కలెక్షన్లు రాబడితే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టంగానే ఉంటుందని ట్రేడ్ వర్గాల చెప్పారు.

Madgaon Express Day 4 Expected Box Office Collections Worldwide

ఇదిలా ఉండగా, సోమవారం హోళీ పండుగ కావడంతో సెలవు దినం ఈ సినిమాకు కలిసి వచ్చింది. ఈ చిత్రం 4వ రోజు సుమారుగా 3 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని అంచనా వేశారు. నాలుగు రోజులతో కలిపి ఈ సినిమా మొత్తంగా 10 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

ఇక తొలివారంలో మంగళ, బుధ, గురు వారాలు కీలకంగా మారాయి. ఈ సినిమా నిలకడగా ఈ మూడు రోజులు వసూళ్లు సాధిస్తే.. గుడ్ ఫ్రైడ్ హాలీడే కావడంతో శుక్రవారం నుంచి మరో మూడు రోజులు సెలవులు ఈ సినిమాకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంటే బ్రేక్ ఈవెన్ సాధించకపోయినా.. చేరువయ్యే ఛాన్స్ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X