ఒక్క టికెట్ కొంటే.. మరో టికెట్ ఫ్రీ.. అయినా కలెక్షన్లు దారుణంగా.. ఆ సినిమా వసూళ్లు ఎంతో తెలుసా?
బాలీవుడ్‌లో మీడియం రేంజ్ సినిమాగా రూపొందిన మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రం మీడియాలో భారీగానే బజ్ క్రియేట్ చేసింది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమా టాలెంటెడ్ యాక్టర్లు నోరా ఫతేహి, ప్రతీక్ గాంధీ, దివ్యెందు, అవినాష్ తివారీ తదితరులు నటించారు. కునాల్ కేము రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే...
మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు, స్కామ్ 1992 సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొన్న ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ (యుద్ద్ ఫేమ్), నోరా ఫతేహి తదితరులు నటించిన ఈ సినిమాకు టాప్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లుగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దోడో, పింకూ, ఆయుష్ ( దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ) ముగ్గురు బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచి గోవా ట్రిప్‌కు వెళ్లాలని కలలు కంటారు. కానీ పింకూ ఫ్యామిలీ కేప్ టౌన్‌లో, ఆయుష్ న్యూయార్క్‌లో సెటిల్ అవుతాడు. దోడో మాత్రం ముంబైలో పిజా బాయ్‌గా పనిచేస్తుంటాడు. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా సంవత్సరాలకు కలిసి ఈ ముగ్గురు గోవా ట్రిప్‌కు ప్లాన్ చేస్తారు. వారు గోవాకు వెళ్లే క్రమంలో ఏం జరిగింది? గోవాలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి అనేది ఈ సినిమా కథ.

మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. కొన్ని వెబ్ సైట్స్ మంచి రేటింగ్‌తో సినిమాకు పాజిటివ్ రివ్యూస్ ఇస్తే.. మరొకొన్ని వెబ్ సైట్స్ అసహనం వ్యక్తం చేశాయి. దాంతో ఆడియెన్స్‌పై ప్రభావం చూపించింది. అయితే ఈ సినిమాకు సుమారుగా 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా 25 శాతానికి మించి ఆక్యుపెన్సీ నమోదు కాలేదనేది ట్రేడ్ రిపోర్ట్.

మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఈ సినిమా యూత్‌కు కనెక్ట్ అవుతుందని భావించిన నేపథ్యంలో పెద్దగా వారు ఆసక్తి చూపలేదు. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అనే స్కీమ్ పెట్టినా వారు ఆసక్తి చూపలేదు. దాంతో ఈ సినిమా తొలి రోజు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.
ఇక మడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్ సినిమా హిట్ కావాలంటే.. ఈ మూవీ సుమారుగా 20 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి బాక్సాఫీస్ వద్ద ఉంది. ఈ సినిమా రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించి సక్సెస్ చిత్రాల జాబితాలో చోటు సంపాదిస్తుందా? లేదా అనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











