Madha Gaja Raja Box Office: 50 కోట్ల కలెక్షన్లతో మధ గజరాజ.. బాక్సాఫీస్ దుమ్మురేపుతున్న విశాల్
తమిళ సూపర్ స్టార్ విశాల్, స్టార్ హీరోయిన్లు అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం మధ గజ రాజ. ప్రముఖ దర్శకుడు సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్కినేని ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కు రిచర్డ్ ఎం నాథన్, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటర్‌గా, విజయ్ ఆంటోని సంగీతం అందించారు. బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
మధ గజరాజ సినిమా 14 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే సినిమా పూర్తి అయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌కు నోచుకోలేదు. చివరకు సమస్యలన్నీ దాటుకొని ఈ సినిమా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. విశాల్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు తొలి రోజు నుంచే బ్రహ్మరథం పడుతున్నారు.

స్టార్ యాక్టర్ సోను సూద్, సంతానం, సుబ్బరాజు లాంటి నటీనటుల కాంబినేషన్ ఈ సినిమాకు క్రేజీగా మారింది. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మీడియం రేంజ్‌లోనే వాల్యూ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 20 కోట్లుగా అంచనా వేశారు.
ఇక విశాల్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. రెండో రోజు 5 కోట్ల రూపాయలు, 3వ రోజు 8 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 8 కోట్ల రూపాయలు, 6వ రోజు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 6 రోజుల్లో ఈ సినిమా 41 కోట్ల రూపాయలను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా వసూళ్లు ప్రధానంగా తమిళనాడులో రాబట్టినవే కావడం గమనార్హం. తమిళనాడులో ఈ సినిమా తొలి రోజు 4 కోట్ల రూపాయలు, రెండో రోజు 3.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తమిళనాడులో 34 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
మధ గజరాజ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా కనీసం 20 కోట్ల షేర్.. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగితే లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికే లాభాల జోన్‌లోకి ప్రవేశించింది. ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది.


Click it and Unblock the Notifications











