Madha Gaja Raja Collections: మధ గజ రాజ కలెక్షన్లు..విశాల్ మూవీకి గ్రాండ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే?

తమిళ సూపర్ స్టార్ విశాల్, స్టార్ హీరోయిన్లు అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం మధ గజ రాజ. ప్రముఖ దర్శకుడు సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్కినేని ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కు రిచర్డ్ ఎం నాథన్, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటర్‌గా, విజయ్ ఆంటోని సంగీతం అందించారు. బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...

మధ గజ రాజ చిత్రం దాదాపు చాలాకాలం క్రితం రూపొందించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌కు నోచుకోలేకపోయింది. అనేక పర్యాయాలు విడుదల వాయిదా పడింది. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకొని ఈ సినిమా జనవరి 14వ తేదీన గ్రాండ్‌గా తమిళంలో రిలీజైంది.

Madha Gaja Raja Collections Worldwide Vishal movie started Decent at Tamil Box Office

మధ గజ రాజ సినిమా బడ్జెట్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను 10 ఏళ్ల క్రితం క్రేజీ కాంబినేషన్‌తో గ్రాండ్‌గా మొదలు పెట్టారు. సోను సూద్, సంతానం, సుబ్బరాజు లాంటి నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా ఓ రేంజ్‌లో ఫిక్స్ అయింది. ఈ సినిమాను సుమారుగా 15 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

అయితే ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మీడియం రేంజ్‌లోనే వాల్యూ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 20 కోట్లుగా అంచనా వేశారు. ఈ చిత్రం 20 కోట్ల షేర్.. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగితే లాభాల జోన్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెల్చేశారు. అలా ఈ చిత్రం బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

విశాల్, అంజలి నటించిన ఈ సినిమా తమిళంలో గ్రాండ్‌గా ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజున ఈ సినిమా తమిళనాడులో 3.5 కోట్ల రూపాయలు వసూల చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే జోష్‌ను రానున్న రోజుల్లో కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: madha gaja raja vishal anjali
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X