Madha Gaja Raja Collections తమిళంలో 50 కోట్లకుపైగా కలెక్షన్లు.. ఆంధ్రా, నైజాంలో ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ విశాల్, స్టార్ హీరోయిన్లు అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం మధ గజ రాజ. ప్రముఖ దర్శకుడు సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్కినేని ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కు రిచర్డ్ ఎం నాథన్, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా, ఎన్‌బీ శ్రీకాంత్ ఎడిటర్‌గా, విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...
సంక్రాంతి కానుకగా మద గజ రాజ చిత్రం జనవరి 14వ తేదీన తమిళంలో గ్రాండ్‌గా రిలీజైంది. ఆ తర్వాత తెలుగు వెర్షన్ తాజాగా జనవరి 31వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌ను అందించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

విశాల్ నటించిన ఈ కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ తమిళనాడు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలివారం తమిళంలో 25.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారం కూడా అదే జోష్‌ను కొనసాగిస్తూ.. 16 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక మూడో వారం ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేయడంతో ఈ చిత్రం 46.5 కోట్లకుపైగా నికర వసూళ్లను, 65 కోట్ల గ్రాస్ వసూళ్లను తమిళ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది.
ఇక కర్ణాటక, కేరళలో కూడా ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తమిళనాడేతర రాష్ట్రాల్లో సుమారుగా 3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కొంత సానుకూలమైన వాతావరణం కనిపించింది. ఈ మూవీకి వైజాగ్, హైదరాబాద్, రాజమండ్రి, భీమవరం, వరంగల్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో డీసెంట్ ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ీ సినిమా తొలి రోజు తెలుగు వెర్షన్ సుమారుగా 50 లక్షల నికర వసూళ్లు, 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











