Madharaasi Worldwide Business: మదరాసి వరల్డ్ వైడ్ బిజినెస్.. శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ నటించిన సినిమా మదరాసి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై హైప్ తీసుకొస్తోంది చిత్ర యూనిట్. అమరన్ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత శివకార్తీకేయన్ నటిస్తోన్న సినిమా కావడంతో మదరాసిపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మదరాసి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? శివ కార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్ల రాబట్టాలి? ఈ వివరాలు పరిశీలిస్తే..

సెప్టెంబర్ 5న మదరాసి రిలీజ్
మదరాసిలో శివ కార్తీకేయన్ సరసర కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌‌‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు.

Madharaasi Pre Release Business Worldwide Sivakarthikeyan movie Budget Theatrical Business Break Even Target

మదరాసికి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
ఏఆర్ మురగదాస్‌తో శివ కార్తీకేయన్ తొలిసారిగా జట్టుకట్టడంతో మదరాసిపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఆయన కెరీర్‌లో 23వ సినిమా. ఎస్‌కే 23గా అభిమానులు ఈ చిత్రాన్ని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అమరన్ తర్వాత తాను యాక్షన్ సినిమాలు కూడా చేయగలనని నిరూపించారు శివకార్తీకేయన్. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్, మాస్ హీరోగా నిలబడేందుకు ఆయన గట్టిగానే ట్రై చేస్తున్నారు.

మదరాసి థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను పార్శ్ ఫిల్మ్స్ దక్కించుకోగా.. అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్, యూరప్‌లో 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థలు శివకార్తీకేయన్ మూవీని విడుదల చేయనున్నాయి.

మదరాసి ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎవరికంటే?
ఇక మదరాసి డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్‌ను పరిశీలిస్తే.. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ మదరాసి డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ వాల్యూ ఎన్ని కోట్లు అనేది మాత్రం తెలియరాలేదు. థియేటర్‌లో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలనే నిబంధన మేరకు ఒప్పందం కుదిరింది. ఇక మదరాసి శాటిలైట్ రైట్స్‌ను జీ సినిమాలు ఛానెల్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఎంత మేర జరిగాయన్నది బయటకు రాలేదు. అయితే శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. శివకార్తీకేయన్ క్రేజ్, మురగదాస్ బ్రాండ్ నేపథ్యంలో ఈ సినిమా అవలీలగా టార్గెట్ కొట్టేస్తుందని ఎస్కే అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X