మమ్ముట్టి కలెక్షన్ల వివాదం.. మధురరాజా 3 రోజుల్లో 11 కోట్లు.. అంతా ఫేక్ అంటూ ట్రోలింగ్
మలయాళ బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ మముట్టి తడాఖా చూపించాడు. ఆయన నటించిన మధుర రాజా చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తున్నది. తొలి వారాంతంలోనే మధుర రాజా చిత్రం 11 కోట్లకుపైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అయితే మధుర రాజా కలెక్షన్లు అంతా భూటకం అని కేరళ నిర్మాతలు పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు కనిపించడం వివాదంగా మారింది. మధుర రాజా వసూళ్ల గురించి మరిన్నీ వివరాలు..

మాఫియా నేపథ్యంగా మధుర రాజా
మాఫియా నేపథ్యంగా మధుర రాజా సినిమా తెరకెక్కింది. సమాజంలోని వ్యతిరేక మూకల ఆటపట్టించే మాఫియా డాన్‌గా మమ్ముట్టి నటించాడు. ఈ చిత్రంలో అనుశ్రీ, మహిమా నంబియార్, జై, జగపతి బాబు, సలీం కుమార్, విజయరాఘవన్, నెడుముడి వేణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు నమోదైనట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి.

మూడు రోజుల్లో 11 కోట్ల వసూళ్లు
మధుర రాజా చిత్రం కేరళ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ రోజున రూ.4..2 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాుల వెల్లడించాయి. అలాగే రెండో రోజున రూ.4 కోట్లు, మూడో రోజున 3.9 కోట్లు వసూలు చేశాయని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తంగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.11 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు. తొలి వారం తర్వాత పులిమురుగన్ నెలకొల్పిన 17 కోట్ల రూపాయల మార్కును అధిగమించే అవకాశం ఉందని అంచనా వస్తున్నారు.

కేరళ నిర్మాతల సంఘం అనుమానం
మధుర రాజా చిత్రం తొలి రోజు కలెక్షన్లపై కేరళ నిర్మాతల సంఘం అనుమానం వ్యక్తం చేసినట్టు సోషల్ మీడియాలో స్పష్టమైంది. వారికి సంబంధించినట్టు భావిస్తున్న ఫేస్‌బుక్ అకౌంట్ మధురరాజా కలెక్షన్లను తప్పుపట్టింది. తొలి రోజున 4 కోట్ల వసూలు చేయలేదు. కేవలం రూ.2.97 కోట్లు మాత్రమే వసూలు చేసింది అని పేర్కొనడంతో కలెక్షన్లు వివాదంగా మారాయి.

మమ్ముట్టిపై సోషల్ మీడియాలో ట్రోల్స్
మధుర రాజా కలెక్షన్లు తప్పు అని తేలడంతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై, మమ్ముట్టిపై ట్రోలింగ్ మొదలైంది. రికార్డుల కోసం ఇంత దిగజారుతారా అనే విధంగా కామెంట్లు విసురుతున్నారు. అయితే మధురరాజా కలెక్షన్లు వాస్తవమా కాదా అనేది చిత్ర యూనిట్ వెల్లడిస్తుందా అనే విషయంపై ట్రేడ్ వర్గాలు వేచి చూస్తున్నాయి.


Click it and Unblock the Notifications











