twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొనసాగుతున్న 'మగధీర' హవా

    By Staff
    |

    ఇన్నాళ్లు మగధీర కలెక్షన్ల ప్రభంజనంతో కలకలలాడిన టాలీవుడ్ మళ్లీ క(న)ష్టాల బాట పట్టింది. ఉన్న సినిమాల్లో మగధీర ఒక్కటే కలెక్షన్లు రాబట్టుకుంటే, మిగతా చిత్రాలు ఆడుతున్న థియేటర్లు వెలవెలబోతున్నాయి. పెద్ద హీరోలు సినిమాల గురించి ఆలోచించకపోవడం, వచ్చిన సినిమాలు అంతంతమాత్రంగానే వుండటంతో బయ్యర్ల కంగుతిన్నారు. పెద్ద సినిమానా, చిన్న సినిమానా ఏది ఆడుతుందో నన్నమీమాంసలో పలువురు నిర్మాతలు పరిశోధనలో పడ్డారు.

    ఇక ఈ వారంలో ప్రేక్షకుల తీర్పను కోరుతూ ఒక్కటంటే ఒక్క చిత్రమే వచ్చింది. చాలా కాలంగా అనేక దేశాల్లో నిర్మాణం జరుపుకొని భారీ అంచనాల మధ్య విడుదలైన 'మల్లన్న' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. 'అపరిచితుడు', 'శివాజీ' వంటి చిత్రాలతో ఈ చిత్రానికి పోలికలున్నప్పటికీ, సరైన కథనం లేకపోవడంతో ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా బాగాలేకపోవడంతో చూసిన ప్రేక్షకుడు ఉసూరుమంటున్నాడు.

    ఇక గతవారం విడుదలైన రవితేజ మార్కు సినిమా ఆంజనేయులు కలెక్షన్లు అంతంతమాత్రంగానే వున్నాయి. ముప్పులనేని శివ 'లైఫ్ స్టైల్', సత్యం బెల్లంకొండ 'స్నేహితుడా..' చిత్రాలు మంచి సినిమాలు అని టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా వీక్ గా వున్నాయి. మొత్తంగా మగధీర చిత్రం ఒక్కటే మంచి కలెక్షన్లు రాబట్టుకొంటోంది. 25 రోజుల్లో 50 కోట్లరూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించడానికి దూసుకుపోతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X