కోల్ కత్తా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న ‘మగధీర’
తమిళ చిత్రాలైన 'శివాజి", 'దశావతారం", తర్వాత 'మగధీర" చిత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టింస్తోంది. టాలీకుడ్లో గత రికార్డుల్ని తిరగరాసే విధంగా దూసుకుపోతోన్న 'మగధీర" రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాలలోనూ రికార్డుల్ని కొట్టగొడ్తోంది. దక్షణాంద్రలో సినిమా విడుదలై రెండు వారాలు నుండి హౌస్ ఫుల్, కలెక్షన్లలో ఎక్కడా తగ్గలేదని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. రికార్డుప్థాయిలో వసూళ్ళను సొంతం చేసుకొంటోంది.
కలకత్తాలోని టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వారి అంచనాల ప్రకారం బాలివుడ్లో బ్లాక్ బస్టర్ మూవీగా పేరొందిన 'లవ్ ఆజ్ కల్" సినిమా కంటే మగధీర సినిమా మేనియా లేని హల్ చల్ సృష్టిస్తుందని, కలకత్తా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోందంటున్నారు. అంతేకాకుండా మగధీర ఎక్స్ ట్రాడినర్ బిజినెస్ అని ఒక ఏపి లోనే కాదూ ఓవరాల్ క్యాపిటల్ సిటీస్ లో ఇదే మొదటి సారి చూడటం అంటున్నారు. కర్ణాటక సినిమా వర్గాలు మగధీర వసూళ్ళపై ఆగ్రహవేశాలు సృష్టించిన విషయం తెల్సిందే, ఎన్ని వివాదాల సంగతెలావున్నా, మగధీర సినిమా ఇంత భారీగా కొనసాగుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.


Click it and Unblock the Notifications











