14 దేశాల్లో 'మగధీర' ప్రతాపం
మగధీర చిత్రం రిలీజ్ విషయంలో మగధీర అనిపించుకుంటోంది. ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రం 14 దేశాల్లో 1500 ప్రింట్లతో రిలీజవుతోంది. ఈ విషయమై నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకుని వాటికి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు రాజమౌళి. 40 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా 15 వందల థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.
అలాగే హీరో రామ్ చరణ్ కూడా ఉత్సాహంతో...'నా రెండవ సినిమాఇంత భారీ ఎత్తున తయారు కావడం చాలా ఆనందంగా ఉంది. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న పాత్రను చేయడం చాలా థ్రిల్‌గా ఫీలయ్యాను. అరవింద్‌గారు చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తీశారు. రాజమౌళిగారు అద్భుతంగా తీర్చిదిద్దారు. తెలుగు సినిమా చరిత్రలో ఇంతకు ముందు చూడని విజువల్ ఫీస్ట్‌గా ఈ చిత్రం ఉంటుంది' అన్నారు.ఇక ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: ఎం.రత్నం, సంగీతం: కీరవాణి, ఫొటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్, సహ నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, నిర్మాత: అల్లు అరవింద్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.


Click it and Unblock the Notifications











