మహా సినిమా కాస్త నయం
ఈ వారం విడుదలైన డబ్బింగ్ కమ్ రీమేక్ సినిమా మహా అర్బన్ ప్రేక్షకులను ఓ మోస్తరుగా ఆకర్షిస్తోంది. తమిళ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ వెర్షన్ నిడివి మూడు గంటలకు పైనే. అంత సుదీర్ఘంగా ఉంటే తెలుగు ప్రేక్షకులకు నచ్చదేమోనన్న ఉద్దేశంతో ఒక గంట తగ్గించారు. ఇది ఒక రకంగా మంచిదే అయినా సీన్ల మధ్య లింకులు తెగిపోయి గంద్రగోళం ఏర్పడింది. అయినా భరత్ హీరో కాబట్టి యువతరం ఈ సినిమా పట్ల ఆకర్షితులవుతున్నారు. నెల క్రితం విడుదలైన మరో తమిళ సాంబారు చిత్రం పందెం కోడి నైజాంలో బాగా ఆడుతోంది. ఈ సినిమాకు మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ క్రమంగా పుంజుకుంటోంది.


Click it and Unblock the Notifications