Maha Samudram collections..భారీ నష్టాల నుంచి గట్టెక్కుతుందా? అద్భుతం జరిగితే తప్ప అంటూ..
RX 100 లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహా సముద్రం రిలీజ్‌కు ముందు ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది. సిద్దార్థ్, శర్వానంద్ లాంటి అగ్ర హీరోలు, అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్లు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రభావం చూపలేకపోయింది. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమా లాభాలను నమోదు చేసే అవకాశం లేదనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం చిత్రం 4 రోజున ఎంత వసూలు చేసిందంటే..

లాభాల్లోకి రావాలంటే
మహా సముద్రం చిత్రానికి భారీ క్రేజ్ ఉండటంతో ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరిగింది. నైజాం హక్కులను రూ.4 కోట్లకు, సీడెడ్ హక్కులు రూ.2.1 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ హక్కులు రూ.6.5 కోట్లకు అమ్ముడుపోయాయి. ఏపీ, నైజాంలో మొత్తం కలిపి ఈ సినిమా రూ.12.6 కోట్లు చేసింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో బిజినెస్ రూ.90 కోట్లు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కలిపి ఈ సినిమా బిజినెస్ 13.5 కోట్లు చేసింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం బాక్సాఫీస్ వద్ద 14 కోట్లు రాబట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4వ రోజు కలెక్షన్లు ఇలా..
మహా సముద్రం చిత్రానికి సంబంధించి ఆంధ్రా, నైజాంలో 4 రోజున కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం 19 లక్షలు వసూలు చేసింది. ఇక సీడెడ్‌లో 14 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4 లక్షలు, గుంటూరులో 4 లక్షలు, కృష్ణా జిల్లాలో 3 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు రూపాయలు వసూలు చేసింది. దాంతో 60 లక్షలు నికరంగా, 1.05 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మొత్తం నాలుగు రోజులు కలెక్షన్లు
ఇక ఏపీ తెలంగాణలో 4 రోజుల మొత్తం కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం 1.77 కోట్లు, సీడెడ్‌లో రూ.1.04 కోట్లు, ఉత్తరాంధ్రలోరూ.70 లక్షలు వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 29 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 37 లక్షలు, గుంటూరులో 50 లక్షలు, కృష్ణా జిల్లాలో 27 లక్షలు, నెల్లూరులో 23 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 5.17 కోట్లు నికరంగా, రూ.8.68 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ఇదిలా ఉంటే.. తెలంగాణ, ఆంధ్రా మినహాయిస్తే ఇతర రాష్ట్రాల్లో వసూళ్ల పరిస్థితి ఇలా ఉంది.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలు, ఓవర్సీస్‌లో 28 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.5.65 కోట్లు నికరంగా, రూ.9.85 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా వసూళ్ల ప్రయాణం నిరాశజనకంగానే సాగుతున్నట్టు కనిపిస్తున్నది.
Recommended Video

బ్రేక్ ఈవెన్ సాధించాలంటే..
ఇక మహా సముద్రం చిత్రం లాభాల్లోకి రావాలంటే భారీగానే రాబట్టాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. 14 కోట్ల బాక్సాఫీస్ లక్ష్యంతో బరిలో దిగిన ఈ చిత్రం రూ.5.65 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 8 కోట్లకుపైగానే వసూలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 9 కోట్లు వసూలు చేస్తే భారీ హిట్‌గా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











