Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాక్ సూపర్: తొలి 5 రోజుల్లో ‘మహానటి’ కలెక్షన్ ఎంత?
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం రేర్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే గొప్ప క్లాసిక్ అంటే ప్రశంసలు సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి టాక్ ఏ సినిమాకు లేదు. ప్రతి ఒక్కరి నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో ఇప్పటి వరకు 'మహానటి' సినిమాపై పెద్ద గా ఆసక్తి లేనివారు సైతం ఈ సినిమా చూసేందుకు థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు.
సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు సాధిస్తోంది. కమర్షియల్ సినిమాల రేంజిలోకాక పోయినా అన్ని ప్రాంతాల్లో సంతృప్తికరమైన వసూళ్లు సాధిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.2 కోట్ల షేర్ సాధించింది. అధిక భాగం వసూళ్లు యూఎస్ఏలో రావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి 5 రోజుల్లో రూ. 7.82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేయగా... అమెరికాలో ఏకంగా రూ. 6.6 కోట్ల షేర్ రాబట్టింది. సావిత్రి జీవితాన్ని తెరపై చూసేందుకు ప్రవాస భారతీయులు ఎంత ఆసక్తి చూపుతున్నారో ఈ అంకెలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఇక ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 3.5 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 80 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.05 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 37 లక్షలు, కృష్ణ ఏరియాలో రూ. 75 లక్షలు, గుంటూరులో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షల షేర్ వసూలైంది. కర్నాటకలో రూ. 60 లక్షలు, తమిళనాడులో రూ. 42 లక్షల షేర్ రాబట్టింది. ఇతర ప్రాంతాల్లో 70 లక్షలు వరకు వసలైంది.