టాక్ గొప్పగా ఉంది....మరి ‘మహానటి’ కలెక్షన్లు ఎలా ఉన్నాయి?

By Bojja Kumar

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెను తెరపై చూస్తుంటే అచ్చం సావిత్రమ్మను చూసినట్లే ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరి సినిమా గురించి ఇంత గొప్ప టాక్ ఉంది కదా... కలెక్షన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

 కమర్షియల్ సినిమా కాదు

కమర్షియల్ సినిమా కాదు

ఇక్కడ ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఇది కమర్షియల్ సినిమా కాదు. భారీ ఓపెన్సింగ్ రాబట్టడానికి స్టార్ హీరో సినిమా అంతకన్నా కాదు. అందుకే కమర్షియల్ సినిమాలతో ఈ చిత్ర కలెక్షన్లు కంపేర్ చేయడం కూడా అంత సబబు కాదేమో!

తొలి రెండు రోజుల్లో ఎంతంటే?

తొలి రెండు రోజుల్లో ఎంతంటే?

తొలి రెండు రోజుల్లో ఈ మూవీ రూ. 2.68 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏరియా వైజ్ పరిశీలిస్తే నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 25 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ.18 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలు వసూలు చేసింది.

ఓవర్సీస్ ఏరియాలో ఓపెనింగ్స్ అదుర్స్

ఓవర్సీస్ ఏరియాలో ఓపెనింగ్స్ అదుర్స్

ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మూవీకి మంచి లాభాలొచ్చాయి. ప్రీమియర్ షోల ద్వారా $ 308K వసూలు చేసింది. నెక్ట్స్ డే $ 195K రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో ఆశాజనకమైన వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ రోజు విడుదలైన ‘మెహబూబా' మూవీ నెగెటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వీకెండ్ ‘మహానటి' వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉంది.

మహానటి

మహానటి

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించగా.... జెమినీ గణేష్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో నటించారు. సావిత్రి సినీ జీవితంలోని ఎందరో ప్రముఖుల పాత్రలను ఈ చిత్రంలో చూపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X