Maharaja Day 7 Collections: విజయ్ సేతుపతి సంచలన రికార్డు.. మహరాజకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రానికి తొలి ఆట నుంచి సూపర్ టాక్ రావడంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నది. దివ్య భారతి, మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నితిలాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత 6 రోజులుగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

క్రైమ్ థ్రిల్లర్‌తోపాటు ఎమోషనల్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సిినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్ల సంఖ్యను భారీగా పెంచుతున్నారు. దాంతో కలెక్షన్లు కూడా భారీగా వసూలు అవుతున్నాయి.

Maharaja Day 7 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Cinema crosses 50 crores mile stone

మహరాజ చిత్రం తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నది. తొలి రోజు ఈ మూవీ 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు అంతకు మించి.. 10.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడో రోజు 12 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక 6వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 70 లక్షల రూపాయల గ్రాస్, కర్ణాటకలో 50 లక్షలు, కేరళలో 40 లక్షలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 4.1 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో మరో 50 లక్షలు రాబట్టింది.

Maharaja Day 7 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Cinema crosses 50 crores mile stone

ఇక గత 6 రోజుల్లో మహరాజ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తమిళనాడులో 27 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్‌లో 9 కోట్ల రూపాయలు, కేరళలో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు ఈ సినిమా 8.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల మైలు రాయిని ధాటింది.

ఇక ఏడో రోజు కూడా విజయ్ సేతుపతి మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఇండియా, ఓవర్సీస్ మార్కెట్‌లో కలిపి మొత్తంగా 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా వారం రోజుల్లో అత్యధిక లాభాలను సాధించిన చిత్రంగా సంచలన రికార్డు క్రియేట్ చేయనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X