Maharaja Day 8 Collections: 100 కోట్లపై కన్నేసిన మహరాజ.. విజయ్ సేతుపతి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే
తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన మహరాజ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ వసూళ్లను రాబడుతున్నది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఎమోషనల్, క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఊహలకు అందని విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. గత 8 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
విజయ్ సేతుపతి నటించిన ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చిత్రాన్ని మీడియం బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 30 కోట్ల రూపాయలతో రూపొందించారు.

ఇక ఈ సినిమా తొలివారం బ్రహ్మండమైన కలెక్షన్లను వసూలు చేసింది. గత 7 రోజుల్లో ఈ చిత్రం తమిళంలో 30 కోట్లు, తెలుగులో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది.
ఇక గత ఏడు రోజుల్లో ఈ సినిమా ఇతర ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 4 కోట్ల రూపాయలు, కేరళలో 3.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో 44 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 62 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఇదిలా ఉండగా, మహరాజ చిత్రం శుక్రవారం కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా 8 రోజు ఇండియా 3 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 66 కోట్ల మేర కలెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications











