Maharaja 2 Weeks Collections: కల్కిని ఎదిరించిన మహరాజ.. 2 వారాల్లో ఎన్ని కోట్లు? ఎంత లాభం?
దక్షిణాదిలో విలక్షణ నటుడు, స్టార్ హీరో విజయ్ సేతుపతి తన కెరీర్‌లో తొలిసారి అతిపెద్ద విజయాన్ని మహరాజ సినిమాతో సొంతం చేసుకొన్నారు. నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమత మోహన్ దాస్, దివ్య భారతి, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. గత 15 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
డాటర్ సెంటిమెంట్, ఫ్యామిలీ వాల్యూస్, హ్యుమన్ ఎమోషన్స్ లాంటి అంశాలతో రూపొందిన మహరాజ చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ సినిమాలో కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చి.. స్టార్ యాక్టర్లను కాకుండా టాలెంటెండ్ యాక్టర్లను తీసుకోవడం, ఉన్నత సాంకేతిక నిపుణులను ఉపయోగించడంతో పరిమితమైన బడ్జెట్ అంటే.. 30 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించారు. తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 2.5 కోట్ల రూపాయల మేర జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

విజయ్ సేతుపతి మూవీకి తొలి ఆట నుంచే బ్రహ్మండమైన టాక్ రావడంతో బాక్సాఫీస్ జర్నీ కూడా యమ స్పీడ్‌గా మొదలైంది. తొలివారం ఈ సినిమా తెలుగు, తమిళంలో కలిపి 39 కోట్ల రూపాయలు నికరంగా, రెండోవారం 24 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఈ రెండు భాషల్లోనే ఈ చిత్రం 63 కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషంగానే చెప్పుకోవాలని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ఇక మహరాజ సినిమా ప్రభాస్ నటించిన కల్కి సినిమా సునామీ సమయంలో స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద నిలబడింది. తక్కువ స్క్రీన్లలో ఉన్నప్పటికీ ఓ రేంజ్ కలెక్షన్లను రాబట్టడం ఈ సినిమా సత్తా ఏమిటో తెలిసింది. కల్కి రిలీజ్ రోజున కూడా తెలుగు, తమిళంలో కలిపి 1 కోటికిపైగా, ప్రపంచవ్యాప్తంగా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక శుక్రవారం 1 రోజున మరో 1 కోటి రూపాయలు రాబట్టింది.

మహరాజా చిత్రం ప్రాంతాల వారీగా సాధించిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. గత 15 రోజుల్లో ఈ సినిమా తమిళంలో 49 కోట్ల రూపాయలు, తెలుగులో 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక కన్నడలో 8 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 30 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 107 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.
మహరాజా చిత్రం కేవలం 30 కోట్ల రూపాయల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టి.. అనూహ్యమైన లాభాలను సొంతం చేసుకొన్నది. ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడమే కాకుండా విడుదలైన ప్రతీ చోట రికార్డు ప్రాఫిట్ సాధించిన మీడియం బడ్జెట్ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా మార్కెట్‌లో విజయ్ సేతుపతి స్టామినాను కూడా పెంచింది.


Click it and Unblock the Notifications











