Maharaja Closing Collections: 32 కోట్ల టార్గెట్.. విజయ్ సేతుపతి మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. నితిలాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దివ్య భారతీ, మమతా మోహన్ దాస్ లాంటి హీరోయిన్లు ప్రధాన పాత్రలో కనిపించగా.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో మెప్పించాడు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? టోటల్ రన్‌లో ఈ సినిమా ఎంత లాభం సాధించిందనే వివరాల్లోకి వెళితే..
చైల్డ్ సెంటిమెంట్‌తో ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందింాచు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తంగా 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 32 కోట్ల షేర్‌గా నిర్ణయించారు.

మహారాజా సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి వారమే 39 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఇక రెండోవారం 24 కోట్ల రూపాయలు, మూడో వారం 6 కోట్ల రూపాయలు, నాలుగో వారం 3 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 72 కోట్ల రూపాయలు నికరంగా, 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.
ఇక రాష్ట్రాల వారీగా, భాషల వారీగా కలెక్షన్లను చూస్తే.. దక్షిణాదిలో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లబించింది. తమిళంలో 57 కోట్ల రూపాయలు, తెలుగులో 15 కోట్లు రూపాయలు, హిందీ 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. తమిళం, తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా భారీ లాభాలను నమోదు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో మహారాజా మూవీకి భారీ రెస్పాన్స్ కనిపించింది. కేవలం నార్త్ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోను భారీ కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం అమెరికా, ఇతర దేశాల్లో కలుపుకొని 25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 105 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.
ఇక 32 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టిన ఈ చిత్రం లాభాల పంటను పండించింది. ఈ చిత్రం తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా సుమారుగా 70 కోట్లకుపైగానే లాభాలను పంచిపెట్టింది. ఇటీవల కాలంలో భారీ ప్రాఫిట్ అందించిన చిత్రాల్లో ఒకటిగా చేరింది.


Click it and Unblock the Notifications











