Maharaja Day 2 Collections: విజయ్ సేతుపతి కెరీర్‌లోనే హయ్యెస్ట్ వసూళ్లు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

దక్షిణాది, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, విలక్షణ నటుడిగా రాణిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు సాధిస్తున్నది. జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలు మించి వసూళ్లను రాబడుతున్నది. యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొంటూ కాసుల పంటను కురిపిస్తున్నది. ఈ సినిమా కలెక్షనల్ వివరాల్లోకి వెళితే..

మహరాజా సినిమాలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్‌ అవుతుందని టార్గెట్ సెట్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1915 స్క్రీన్లలో రిలీజ్ చేసింది.

Maharaja Movie day 2 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Rocking at GBOC

ఇక విజయ్ సేతుపతి సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి చెన్నైలో మంచి రెస్సాన్స్ వస్తున్నది. చెన్నైలో 40 శాతం, బెంగళూరులో 35 శాతం, మధురైలో 45 శాతం, పాండిచ్చేరిలో 45 శాతం, సేలంలో 40 శాతం, త్రిచూర్‌లో 50 శాతం, ముంబైలో 50 శాతం, ఢిల్లీలో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది.

ఇక తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. తమిళనాడులో 3.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్లు, కర్ణాటకలో 50 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 5.6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు సుమారుగా 8 కోట్ల రూపాయలు రాబట్టింది.

Maharaja Movie day 2 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Rocking at GBOC

ఇక రెండో రోజు మహరాజ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. భారీగానే కాసులు పంట పండించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో ఈ చిత్రం మరో 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లో మరో 1.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. రెండో రోజు ఈ సినిమా 5.5 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది.

విజయ్ సేతుపతి తన కెరీర్‌లో 50వ చిత్రంగా రూపొందిన మహారాజ అత్యధిక వసూళ్లను సాదించే సినిమాగా ఓ రికార్డు దిశగా ప్రయాణిస్తున్నది. ఇప్పటి వరకు ఇలాంటి కలెక్షన్లు తన సినిమాలకు రాలేదనేది వాస్తవం. సోలో హీరోగా బాక్సాఫీస్‌ను ఆయన షేక్ చేస్తుండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X