Maharaja Day 4 Collections: మహరాజ వసూళ్ల తుఫాన్.. విజయ్ సేతుపతి మూవీ లాభాల్లో.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. జూన్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట కాసుల పంట పండిస్తున్నది. నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షలను ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా గత మూడు రోజుల్లో సాధించిన కలెక్షన్లు, నాలుగో రోజు వసూళ్ల అంచనా వివరాల్లోకి వెళితే..

మహారాజ బడ్జెట్ ఎంతంటే?
డాటర్ సెంటిమెంట్, ఎమోషన్స్, అలాగే యాక్షన్, ఫన్ అంశాలతో రూపొందించిన మహరాజ సినిమాకు భారీగా ఆదరణ వ్యక్తమవుతున్నది. వారాంతంలోనే కాకుండా వర్కింగ్ డే రోజున కూడా రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. 20 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ సినిమా రాబట్టిన వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Maharaja Movie day 4 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Rocking at GBOC

తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా
మహారాజా సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ మూవీ ప్రమోషన్స్ వీక్‌గా ఉండటంతో గొప్పగా వసూళ్లు నమోదు కాలేదు. తొలి ఆట తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. తమిళనాడులో 3.6 కోట్ల రూపాయలు, తెలుగులో 1.2 కోట్ల రూపాయలు, కర్నాటకలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు 8 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

రెండో రోజు కలెక్షన్లు
ఇక రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 4.8 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయల కలెక్షన్లు వసూలు చేసింది. దాంతో రెండో రోజు 7 కోట్ల రూపాయలు రాబట్టింది.

Maharaja Movie day 4 expected Box Office Collections Worldwide Vijay Sethupathi Rocking at GBOC

మూడో రోజు కలెక్షన్లు
ఇక మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 6.5 కోట్ల రూపాయలు, తెలుగులో 2.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలు, కేరళలో 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రాబట్టింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

నాలుగో రోజు కలెక్షన్లు ఇలా..
ఇక నాలుగో రోజు విషయానికి వస్తే.. భారీగానే వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా తమిళంలో 3 కోట్లకుపైగా, తెలుగులో 2 కోట్లకుపైగా అలాగే మిగితా ప్రాంతాల్లో 1 కోటికిపైగా వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో 4వ రోజు 6 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మూడు రోజుల్లోనే లాభాల్లోకి..
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం మొత్తంగా 33 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాల్లోకి ప్రవేశించింది. ఇక నుంచి భారీ లాభాలను సాదించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X