Maharaja Day 5 Collections:50 కోట్లు కుమ్మేసిన మహరాజ.. విజయ్ సేతుపతి సంచలన రికార్డు!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన రావడంతో వసూళ్ల ప్రవాహం కొనసాగుతున్నది. విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లను రాబడుతున్నది. జూన్ 14వ తేదీన రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
బడ్జెట్ ఎంతంటే?
తమిళంలో యువ దర్శకుడు నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీడియం రేంజ్ ఆర్టిస్టులతో, అలాగే టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో తెరకెక్కించారు. అన్ని ఖర్చులు కలుపుకొని ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పూర్తి చేసి ప్రేక్షకుల ముందు ఉంచారు. రిలీజ్ తర్వాత ఈ మూవీకి అనూహ్యమైన స్పందన రావడంతో కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తున్నాయి.

రికార్డు ఫుట్ ఫాల్స్
ఇండియాలో మహరాజ సినిమాకు అన్ని భాషల్లో సూపర్ రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమాకు సుమారుగా ప్రతీ రోజు 1 లక్షకుపైగా ఫుట్ ఫాల్స్ నమోదు అవుతున్నాయి. దాంతో ఈ సినిమాకు డీసెంట్ ఆక్యుపెన్సీ అన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతున్నది. దాంతో బాక్సాఫీస్ వద్ద రన్ ఎక్కువగా ఉంటుందనే ఫీల్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
ఇండియాలో కలెక్షన్లు
మహరాజా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు 5 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.75 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.4 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 6.5 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా కేవలం 5 రోజుల్లో తమిళం, తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.

ఆంధ్ర, కేరళ, కర్ణాటకలో
అలాగే తమిళంలో 24 కోట్ల రూపాయలు, ఆంధ్ర, నైజాంలో 7 కోట్ల రూపాయలు, కేరళలో కూడా ఈ సినిమాకు భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రానికి గత 5 రోజుల్లో సుమారుగా 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడలో ఈ సినిమా ఇప్పటి వరకు సుమారుగా 4 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఓవర్సీస్‌లో కూడా మహరాజకు భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ మూవీకి గత 5 రోజుల్లో సుమారుగా 7.5 కోట్ల రూపాయలు అమెరికా, కెనడా, ఇతర దేశాల్లో వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కొనసాగుతున్నది. దాంతో ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు 45 కోట్ల మేర వసూళ్లు సాధించింది.

అయితే మహరాజ చిత్రం వర్కింగ్ డే రోజున కూడా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తున్నది. ఈ సినిమా 6వ రోజున కూడా మెరుగైన వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ బుధవారం 3.5 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య కలెక్షన్లను నమోదు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే విజయ్ సేతుపతి కెరీర్‌లో సంచలన వసూళ్లు సాధిస్తున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తున్నది.


Click it and Unblock the Notifications











