Maharaja Collections విజయ్ సేతుపతి మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. మహరాజకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, మమతా మోహన్ దాస్, దివ్య భారతి, అనురాగ్ కశ్యప్ తదితరులు నటించిన చిత్రం మహరాజ. నితిలాన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి సానుకూలమైన రెస్పాన్స్ వస్తున్నది. జూన్ 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం పాజిటివ్‌గా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మహరాజ సినిమా కథ విషయానికి వస్తే.. ప్రమాదంలో భార్యను కోల్పోయిన భర్త మహరాజ తన కూతురే ప్రపంచంగా బతుకుతాడు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో ఇంట్లో దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలు వారి జీవితాల్లో అలజడి సృష్టిస్తాడు. ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన చెత్తకుండి కోసం మహరాజ పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తాడు. దానిని తెచ్చి ఇస్తే 7 లక్షల రూపాయలు లంచం ఇస్తానని చెబుతాడు. ఇంతకు ఆ చెత్త బుట్ట దొరికిందా? ఆ చెత్త బుట్ట వెనుక కథ ఏమిటి? అనేది సినిమా.

Maharaja Movie day Wise expected Box Office Collections Worldwide Vijay Sethupathi movie rocking at Global Box office

మహరాజా సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే బ్రేక్ ఈవెన్‌ అవుతుందని టార్గెట్ సెట్ చేశారు.

ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందు ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ సేతుపతి 50వ సినిమా కావడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో సుమారుగా 1915 స్క్రీన్లలో రిలీజ్ చేయడం రికార్డుగా మారింది.

Maharaja Movie day Wise expected Box Office Collections Worldwide Vijay Sethupathi movie rocking at Global Box office

మహరాజ మూవీకి సానుకూలమైన రివ్యూలు రావడం, మౌత్ టాక్ పెరగడంతో ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పుంజుకోవడం మొదలుపెట్టింది. మార్నింగ్ షో తర్వాత మ్యాట్నీకి బెటర్‌గా ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

మహారాజా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తమిళనాడులో 2 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని అంచనా వేశారు. ఇక తమిళేతర రాష్ట్రాల్లో 1 కోటి వరకు కలెక్షన్లు రాబడుతుందని పేర్కొన్నారు. ఓవర్సీస్‌లో మరో 1 కోటి రూపాయలు వసూలు చేస్తుందని తెలిపారు. దాంతో ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 4 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X