మహర్షి 13 డేస్ కలెక్షన్ రిపోర్ట్.. తగ్గేదే లేదన్నట్లుగా వసూళ్ల సునామీ

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపుదిద్దుకున్న చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా నేటికీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారంతా. విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న మహర్షి విడుదల తర్వాత ఆ అంచనాలను మించి పరుగులు పెడుతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది మహర్షి.

ఇప్పటివరకు మహర్షి 13 రోజుల జర్నీ పూర్తిచేసుకుంది. ఆ కలెక్షన్ల వివారాలు చూస్తే.. మొత్తంగా 13 రోజు 2 కోట్లు రాబట్టింది మహర్షి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1 .58 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ సినిమా క్రిందటి దినం 12 వ రోజుతో పోల్చితే కేవలం 3 లక్షలు మాత్రమే తక్కువ రాబట్టడం విశేషం. ఇక ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మొత్తం 13 రోజుల రిపోర్ట్ పరిశీలిస్తే..

Maharshi 13 days colections report

నైజాం: 26.19C
సీడెడ్ : 8.93C
ఉత్తరాంధ్ర: 9.65C
ఈస్ట్: 6.45C
వెస్ట్: 5.1C
కృష్ణా: 5.06C
గుంటూరు: 7.16C
నెల్లూరు: 2.53C
టోటల్: 71 .04C

మరో 5 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటేస్తుంది మహర్షి. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. రైతు నేపథ్యంలో చూపించిన సన్నివేశాలు యువతరానికి వ్యవసాయం విలువను తెలియజేస్తున్నాయి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా పలు రికార్డులు తిరగరాస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X