మహర్షి 2 వారాల కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే.. మహేష్ కెరీర్‌లో రెండో సినిమాగా

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 2 వారాలు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలకు ముందు నుంచే టీజర్, ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న మహర్షి.. విడుదల తర్వాత ఆ అంచనాలను మించి పరుగులు పెడుతోంది. కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది మహర్షి.

ఇంప్రెసివ్ జర్నీ

ఇంప్రెసివ్ జర్నీ

మహేష్ కెరీర్‌లో 25 వ సినిమాగా వచ్చిన మహర్షి ఈ రెండు వారాలు ఇంప్రెసివ్ జర్నీ కొనసాగించింది. కేవలం వారాంతాల్లోనే గాక వారంలో మిగిలిన రోజుల్లో కూడా మహర్షి డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. మహర్షి సాగించిన ఈ రెండు వారాల జర్నీలో 14 వ రోజు కూడా 2 కోట్ల రూపాయలు వాసులు చేసి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మంచి జోష్ లో ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే

ప్రపంచ వ్యాప్తంగా మహర్షి డీసెంట్ రన్ లో ఉంది. కేవలం రెండు వారాల్లోనే 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మహర్షి పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా మరో మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. శ్రీమంతుడు తరువాత మహేష్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా మహర్షి పేరును లిఖించుకుంది.

మహేష్ కెరీర్‌లో రెండో సినిమా

మహేష్ కెరీర్‌లో రెండో సినిమా

మహేష్ బాబు కెరీర్ పరంగా కేవలం రెండు వారాల్లో 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన రెండో సినిమాగా మహర్షి రికార్డు సృష్టించింది. గతంలో ఈ ఫీట్ ని భరత్ అనే నేను సినిమా సాధించింది. చూస్తుంటే మహర్షి సినిమా కొద్ది రోజుల్లోనే 100 కోట్ల షేర్ రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

మహర్షి మూవీ

మహర్షి మూవీ

మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమాగా వంశీ పైడిపెల్లి రూపొందించిన ఈ సందేశాత్మక చిత్రంలో మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ బాగా ఆకట్టుకున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వీ పొట్లూరి నిర్మాణ విలువలు మహర్షి రేంజ్ పెంచేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

మహర్షి తర్వాత

మహర్షి తర్వాత

మహర్షి లాంటి బిగ్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు తన 26 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న ఆడిపాడనుండగా.. విజయశాంతి కీలక పాత్ర పోషించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X