twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు వారాల తర్వాత చెన్నైలో.. 'మహర్షి' మరో అరుదైన ఫీట్

    |

    మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 3 వారాలు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం వెనక్కి తహగ్గకుండా దూసుకుపోతూనే ఉంది. చిత్రంలో మహేష్ నటన, సామాజిక అంశాల పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తున్న ఈ సినిమా చెన్నైలో ఆ అరుదైన ఫీట్ సాధించింది.

    సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమిళ ఆడియన్స్ పరంగా కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మహేష్ కెరీర్ లో వచ్చిన అన్ని సినిమాలకు చెన్నై నగరంలో మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన మహర్షి సైతం చెన్నై కలెక్షన్స్ పరంగా తన హవా కొనసాగించింది. విడుదలైన 18 రోజుల్లోనే చెన్నైలో కోటి రూపాయలకు పైగా వసూలు చేసి అరుదైన ఘనత సాధించింది. గతంలో మహేష్ హీరోగా వచ్చిన భరత్ అనే నేను అంతకుముందు ఈ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా ఉండేది. ఇప్పుడు ఆ సినిమా సరసన మహర్షి కూడా వచ్చి చేరింది.

    Maharshi 18 days colection report in Chennai

    ప్రపంచ వ్యాప్తంగా చూసినా మహర్షి సినిమా ఇప్పటికీ డీసెంట్ రన్ లో ఉంది. కేవలం రెండు వారాల్లోనే 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన ఈ సినిమా నేటికీ పరుగులు పెడుతోంది. ఈ పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా మరో మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే, అల్లరి నరేష్ నటన బాగా ఆకట్టుకుంది. రైతు నేపథ్యంలో రూపొందించిన కొన్ని సీన్స్ సినిమాలో హైలైట్ గా నిలవడమే గాక సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. ఈ సినిమా ఇచ్చిన జోష్ లో మహేష్ తన 26 వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నారు.

    English summary
    Mahesh babu's Maharshi movie running successfully. In Chennai city Maharshi collects 1 crore above with in 18 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X